దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ చిత్రంలో కొమురంభీమ్ పాత్రలో తారక్ నటనకు ప్రపంచమంతా ఫిదా అయింది. ఇటీవల ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా జపాన్ లో సందడి చేశారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ తన తరువాత సినిమా కోసం సిద్ధమవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.
Advertisement
ఈ సినిమాకి NTR30 అనే వర్కింగ్ టైటిట్ తో రాబోతుంది. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా తారక్ న్యూలుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ స్టైలీష్ లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రముఖ అడ్వర్టైజింగ్ సెలబ్రెటీ ఫోటో గ్రాఫర్ అవినాష్ గోవారికర్ తన సోషల్ మీడియా ఖాతాలో జూనియర్ ఎన్టీఆర్ క్లాసిక్ లుక్ ని షేర్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ చాలా స్టైలీష్ గా కనిపిస్తున్నారు.
Advertisement
Man of the Masses… looking dapper with the glasses!! 💥💥#PostPackUpShot@tarak9999 pic.twitter.com/3jPDpBLKHg
— Avinash Gowariker (@avigowariker) November 22, 2022
ప్రధానంగా గ్లాసెస్ సూట్ లో అదరగొట్టాడనే చెప్పాలి. ఎన్టీఆర్ న్యూ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాకి షేక్ చేస్తుంది. కొరటాల-ఎన్టీఆర్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఈ సినిమా తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు ఎన్టీఆర్. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రీ లుక్ భారీ అంచనాలను పెంచేసింది. ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.
Also Read : డైలాగ్స్ ఎలా చెప్పాలో బాలయ్యకు చేసి చూపించిన SR:NTR.. ఏ సినిమా అంటే..?