Home » ఎన్టీఆర్ కొండవీటి సింహం సినిమాలో చిరంజీవి నటించాలి కానీ మోహన్ బాబు ఎలా వచ్చారంటే ?

ఎన్టీఆర్ కొండవీటి సింహం సినిమాలో చిరంజీవి నటించాలి కానీ మోహన్ బాబు ఎలా వచ్చారంటే ?

by Srilakshmi Bharathi
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది నటీనటులు వచ్చినా మెగాస్టార్ ను తలదన్నే నటుడు ఇంకా రాలేదనే చెబుతూ ఉంటారు. అలంటి చిరంజీవి లైఫ్ లో కూడా ఓ పరిస్థితి ఎదురైంది. చిరంజీవి నటించాల్సిన పాత్రను మోహన్ బాబుకు ఇవ్వాల్సి వచ్చిందట. అసలు ఇది ఏ సినిమానో.. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం. సీనియర్ ఎన్టీఆర్ టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడే.. మెగాస్టార్ చిరంజీవి కూడా అప్పుడప్పుడే స్టార్ హీరో గా ఎదుగుతున్న రోజులవి. మెగాస్టార్ చిరంజీవి ని కూడా సీనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఓ పాత్ర కోసం తీసుకున్నారు.

chiranjeevi-and-ntr

Advertisement

 

ఆ సినిమా ఏదో కాదు. కొండవీటి సింహం. సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన కొండవీటి సింహం సినిమాలో.. చిరంజీవిని కూడా కొడుకు పాత్ర కోసం తీసుకోవాలని అనుకున్నారట. ఈ సినిమాకు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్, ఏ ఎన్నార్ లతో కూడా చిరంజీవి అప్పటికే తెరని పంచుకున్నారు.

ఏ ఎన్నార్ తో మెకానిక్ అల్లుడు సినిమాలో కలిసి నటించిన చిరంజీవి, తిరుగు లేని మనిషి సినిమాలో ఎన్టీఆర్ కు బావమరిదిగా నటించారు. ఇక, కొండవీటి సింహంలో కూడా ఆయనకు కొడుకుగా తీసుకోవాలని దర్శకేంద్రుడు అనుకున్నారట. అప్పటికే స్క్రీన్ టెస్ట్ లు అన్నీ అయిపోయి షూటింగ్ కూడా మొదలైపోయింది.

Advertisement

 

ఈ సినిమా షూటింగ్ కోసం ఎన్టీఆర్ కేవలం నెల రోజుల టైం మాత్రమే ఇచ్చారట. కానీ, చిరంజీవి మాత్రం ఆయన కొడుకుగా నటించాల్సి ఉంది. సినిమాలో భాగంగా ఆయన కొడుకుగా ఎదురు తిరిగి పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పాల్సి ఉంది. కానీ, ఎన్టీఆర్ అంటే ఉన్న గౌరవం, అప్పుడప్పుడే ఎదుగుతున్న హీరోగా ఉండడం చేత.. అలా ఎదురు తిరిగి డైలాగ్స్ చెప్పడానికి చిరంజీవి మొహమాటపడ్డారట.

దీనితో డైలాగ్ చెప్పే సమయంలో తడబడుతుండంతో.. టైం గడిచిపోతుందని నిర్మాతలు ఫీల్ అయ్యారు. చిరంజీవి, ఎన్టీఆర్ తో అలవాటు పడి డైలాగ్స్ చెప్పాలంటే సమయం పడుతుందని భావించిన నిర్మాతలు.. చిరు ప్లేస్ లో మోహన్ బాబు ని తీసుకున్నారు. మోహన్ బాబు అప్పటికే ఎన్టీఆర్ సింహబలుడు సినిమాలో విలన్ గా నటించి.. భారీ భారీ డైలాగ్స్ ఆయన ఎదురుగ చెప్పి ఉన్నాడు. అందుకే ఆ పాత్రకి సరిపోతాడని అనుకున్నారు. ఇక మోహన్ బాబు కూడా ఆ పాత్రలో అలవోకగా నటించేసి.. పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పి మంచి పేరు సంపాదించుకున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading