Home » బాలకృష్ణ పెళ్ళికి ఎన్టీఆర్ వెళ్లలేదంట… దీనికి కారణం ఏంటో తెలుసా…!

బాలకృష్ణ పెళ్ళికి ఎన్టీఆర్ వెళ్లలేదంట… దీనికి కారణం ఏంటో తెలుసా…!

by Bunty
Ad

సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి అంతర్జాతీయంగా తెలుగు వారికి పేరు తెచ్చిన ఘనుడు ఎన్టీఆర్. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. అంతేకాకుండా రాజకీయాల్లో కూడా రాణించాడు. అయితే ఎన్టీఆర్ కు 12 మంది సంతానం. వారిలో ఎనిమిది మంది కొడుకులు, నలుగురు కూతుర్లు. అయితే ఎన్టీఆర్ బాలకృష్ణ, రామకృష్ణ వివాహానికి వెళ్లలేదు.

Advertisement

వీరిద్దరి వివాహాలు ఒకేరోజు అయినప్పటికీ వీరి వివాహానికి ఎన్టీఆర్ రాలేకపోయారు. రామకృష్ణ, బాలకృష్ణ వివాహం తిరుపతిలో జరిగింది. వారి వివాహ సమయంలో ఎన్టీఆర్ ప్రజా యాత్రలో బిజీగా ఉన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. రాష్ట్రమంతా ఎలక్షన్ల సమయం ఉండడం వల్ల ఎన్టీఆర్ ప్రజా యాత్రలో చాలా బిజీగా ఉన్నారు. దీంతో వారి వివాహానికి వెళ్లలేక పోయారు. వివాహానికి వెళితే యాత్ర ఆపవలసి వస్తుందని ఎన్టీఆర్ వివాహానికి వెళ్లలేదట.

Advertisement

ఇక తిరుపతిలో వివాహమైన అనంతరం బాలకృష్ణ, రామకృష్ణ దంపతులు యాత్రలో ఉన్న ఎన్టీఆర్ వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకున్నారట. కొడుకుల కన్నా తనకు రాజకీయంపైనే… ప్రజల సమస్యలపైనే ఎక్కువ ఆసక్తి ఉండేది. ఎంతటి వారైనా సరే ఎలాంటి సమయంలోనైనా కొడుకుల వివాహాన్ని దగ్గరుండి మరి జరిపిస్తారు. కానీ ఎన్టీఆర్ మాత్రం వివాహాన్ని పక్కన పెట్టేసి ప్రజల గురించి ఆలోచించి వారి సమస్యలను తీర్చేందుకు బయలుదేరారు. అంతటి గొప్ప వ్యక్తి మన ఎన్టీఆర్. ఈ విషయాన్ని ఇటీవల ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరిగిన సమయంలో ప్రముఖ నటుడు మురళీమోహన్ తెలియజేయడం జరిగింది.

ఇవి కూడా చదవండి

10వేల కోసం ఇబ్బంది పడ్డ విజయ్ దేవరకొండ ఇప్పుడు ఎంత పెద్ద కోటీశ్వరుడు తెలుసా…?

అక్కినేని నాగార్జున.. దగ్గుబాటి శ్రీ లక్ష్మీ విడాకులు తీసుకోవడానికి అసలు కారణం ఏంటో తెలుసా…?

శుక్రవారం రోజున పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి…!

Visitors Are Also Reading