తెలుగు సినీ చరిత్రలో ఎన్టీఆర్-దాసరినారాయణరావు కాంబినేషన్ వచ్చిన బొబ్బిలిపులి చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం విడుదలై నేటికి 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. బొబ్బిలిపులి సినిమా ఎన్టీఆర్ రాజకీయ వేదికగా పునాదిగా నిలిచింది. ఈ చిత్రం విడుదల తరువాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ అభిమానులకే కాదు.. సామాన్య ప్రేక్షకులకు కూడా బొబ్బిలిపులి సినిమా ఓ తీపి జ్ఞాపకం. ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
నటరత్న ఎన్టీఆర్, దర్శకరత్న దాసరినారాయణరావు కాంబోలో వచ్చిన బొబ్బిలి పులి సినిమా టైటిల్‌తోనే అప్పట్లో పెద్ద సంచలనమైంది. ఈ చిత్రం పలు సంచనాలకు వేదికగా నిలిచింది. ఈ సినిమా సాధించిన రికార్డులు ఇప్పటికీ కొన్ని సినిమాలు బ్రేకు చేయలేకపోయాయంటే.. ఈ సినిమా మాస్ లో ఎంత పెద్ద హిట్ అయిందో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సినిమా విడుదలై నేటికి నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. బొబ్బిలిపులి ఎన్టీఆర్ రాజకీయ వేదికగా పునాదిగా నిలిచింది. ఈ చిత్రం విడుదల తరువాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కూడా అయ్యారు.
Advertisement
ఎన్టీఆర్ అభిమానులకే కాదు.. సామాన్య ప్రేక్షకులకు బొబ్బిలిపులి సినిమా అంటే ఓ తీపి జ్ఞాపకం నటరత్న ఎన్టీఆర్, దర్శకరత్న దాసరి నారాయణరావు కలయికలో వచ్చిన ఐదవ చిత్రం బొబ్బిలిపులి. వీరి కలయికలో వచ్చిన చివరి సినిమా ఇదే కావడం విశేషం. ఎన్టీఆర్ కు జోడిగా శ్రీదేవి, జయచిత్ర నటించారు. ఈ చిత్రంలో శ్రీదేవి ప్రియురాలి పాత్రలో నటిస్తే. జయచిత్ర భార్య పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి జేవీ రాఘవులు అద్భుతమైన సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాటలు అన్ని సూపర్ హిట్ సాధించాయి. ఆర్మీ నేపథ్యంలో వచ్చే జననీ జన్మభూమి పాట అప్పటికీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ దేశభక్తి గీతంగా నిలిచిపోయింది.
Advertisement
ఒకటో నెంబర్ బస్సు తెల్లచీరలో యెడ్డమంటే ఓ సుబ్బారావు, సంభవం వంటి పాటలు అన్ని మ్యూజికల్ హిట్‌గా నిలిచాయి. బొబ్బిలిపులి చిత్రాన్ని విజయమాధవి కంబైన్స్ పతాకంపై వడ్డె రమేష్ నిర్మించారు. ఈ చిత్రం కథ విషయానికొస్తే.. మేజర్ చక్రధర్ సమాజంలో అవినీతి, లంచగొండితనాన్ని భరించలేక నక్సలైట్ అవతారమెత్తుతాడు. ఆ తరువాత సంఘానికి పట్టిన చీడ పురుగులను ఎలా ఏవివేశాడనేది స్టోరీ.ప్రధానంగా క్లైమాక్స్ కోర్టుల సీన్‌లో కోర్టు కోర్టుకు తీర్పు తీర్పుకు మార్పు ఉన్నట్లయితే మీ న్యాయస్థానాల్లో తీర్పు ఉన్నట్టా లేనట్టా అని ఎన్టీఆర్ చెప్పే డైలాగ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఇక ఎన్టీఆర్ ఎన్నికల ప్రచార సమయంలో ఉండగానే విడుదలై ఈ సినిమా సంచలన విజయమే సాధించింది. ఎన్టీఆర్-దాసరి నారాయణరావు కలయికలో వచ్చిన బొబ్బిలిపులి సినిమా 39 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ఆడింది. ఎన్టీఆర్ సీఎం కావడానికి బొబ్బిలి పులి చిత్రం కీ రోల్ పోషించిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే కోర్టు సీన్ తెలుగు సినిమా చరిత్రలో ఓ ట్రెండ్ సెట్టర్ అనే చెప్పవచ్చు. ఈ సినిమా స్పూర్తితో చిరంజీవి ఖైదీ, ఠాగూర్, విజయశాంతి ఒసేయ్‌రాములమ్మ, జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ వంటి చిత్రాలు ఇదే కోవకు చెందినవి. ఇలాంటి చిత్రాలు చాలానే ఉన్నాయి. ఎన్టీఆర్-దాసరి నారాయణరావు కాంబోలో వచ్చిన చివరి చిత్రం బొబ్బిలిపులి. ఈ సినిమా అప్పటివరకు ఉన్న అన్ని తెలుగు సినిమా రికార్డులను తిరగరాసింది.
Also Read :
ఎన్టీరామారావు ఇంటితో బాబాయ్ హోటల్ కు ఉన్న అనుబంధం ఏంటో తెలుసా…?
చిరంజీవి వీరాభిమానితో నాగబాబు పెళ్లి.. అసలు ఎలా జరిగిందంటే..?