Home » ఎన్టీరామారావు ఇంటితో బాబాయ్ హోటల్ కు ఉన్న అనుబంధం ఏంటో తెలుసా…?

ఎన్టీరామారావు ఇంటితో బాబాయ్ హోటల్ కు ఉన్న అనుబంధం ఏంటో తెలుసా…?

by AJAY
Ad

నందమూరి తారక రామారావు ఈ పేరు చెబితే ప్రతి తెలుగు వాడి మనసులో అన్నగారు అనే భావన కలుగుతుంది. ఎన్టీఆర్ ఓవైపు సినిమా రంగంలో మరోవైపు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. సినిమాల్లో రాజకీయ, పౌరాణిక పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అతి తక్కువ కాలంలో వరుస సూపర్ హిట్లను అందుకుని స్టార్ హీరో స్థాయికి ఎదిగారు.

Advertisement

మాస్… క్లాస్ ఇలా అన్ని రకాల ఆడియన్స్ ను ఎన్టీఆర్ మెప్పించగలిగారు. అంతేకాకుండా ఎలాంటి పాత్రను అయినా ఎన్టీఆర్ అలవోకగా చేసేవారు. ఇక రాజకీయాల విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీని స్థాపించి కాంగ్రెస్ ని ఓడించి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. తెలుగు ప్రజలకు ఎనలేని సేవలను అందించారు. ఇప్పటికీ ఎన్టీఆర్ తీసుకువచ్చిన పథకాలకు పేర్లు మార్చి అమలు చేస్తున్నారు.

Advertisement

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ సినిమాలకు రాకముందు ఎంతో కష్టపడ్డారు. బెజవాడలోని బాబాయి హోటల్ అనే హోటల్ కు పాలు పెరుగు పోసేవారు. దాంతో ప్రతిరోజు ఎన్టీఆర్ బాబాయ్ హోటల్ కి వెళ్లి పాలు పెరుగు పోయడం వల్ల అక్కడి వాళ్ళతో మంచి అనుబంధం ఏర్పడింది. ఎన్టీఆర్ పుట్టింది పెరిగింది అంతా నిమ్మకూరులోనే అయితే సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ మద్రాస్ కు మకాం మార్చారు.

సినిమాలలో బిజీగా ఉండి స్టార్ హీరోగా ఎదిగిన ఎన్టీఆర్ వద్దకు బాబాయ్ హోటల్ నుండి ఒక బృందం వచ్చి కలిసి వెళుతూ ఉండేది. ఇలా వాళ్లకు ఎన్టీఆర్ ని చూడాలనిపించినప్పుడల్లా బృందమంతా కలిసి మద్రాస్ కు చేరుకునేది. ఎన్టీఆర్ కూడా వాళ్లను తన అతిథులుగా భావించి షూటింగ్ ఉన్నా కూడా క్యాన్సిల్ చేసుకుని తన ఇంట్లో అతిధి మర్యాదలు చేసేవారు. అలా ఎన్టీఆర్ ఇంటికి బాబాయ్ హోటల్ కు మంచి అనుబంధం ఉంది.

Visitors Are Also Reading