Home » ఎన్టీఆర్ బుచ్చిబాబు సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్..!

ఎన్టీఆర్ బుచ్చిబాబు సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్..!

by AJAY
Published: Last Updated on
Ad

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాలో న‌టించారు. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. ఇక ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి సినిమాను కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడ‌ర్ పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్టుగా టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండ‌బోతుందంటూ టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

ntr bheem poster

ntr bheem poster

ఇదిలా ఉండ‌గా ఈ సినిమా త‌ర‌వాత ఎన్టీఆర్ బుచ్చిబాబు ద‌ర్శ‌కత్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నార‌ట‌. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన ప‌నులు కూడా చ‌క‌చ‌కా జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం. ఈ చిత్రానికి మైత్రీమూవీమేక‌ర్స్ వారు నిర్మిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్క‌బోతుంది అంటూ గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

Advertisement

అయితే తాజాగా ఈ సినిమాపై మ‌రో ఆస‌క్తిక‌ర వార్త వినిపిస్తోంది. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. అంతే కాకుండా గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోయే ఈ సినిమాలో ఎన్టీఆర్ క‌బ‌డ్డీ ప్లేయ‌ర్ కాగా హీరో పేరు కూడా పెద్దినే అట‌. దాంతో సినిమాకు కూడా అదే టైటిల్ ను ఖ‌రారు చేసే అలోచ‌న‌లో ఉన్న‌ట్టు టాక్. అంతే కాకుండా ఈ సినిమాలో హీరోయిన్ గా జాహ్న‌వి క‌పూర్ న‌టించే అవ‌కాశాలు ఉన్న‌ట్టు కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి.

Visitors Are Also Reading