Home » ఎన్టీఆర్ ఎవరిని భయపెట్టబోతున్నాడు..!

ఎన్టీఆర్ ఎవరిని భయపెట్టబోతున్నాడు..!

by Azhar
Ad
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం అభిమానులు చాలా సహనంగా ఓపికతో ఎదురు చూస్తున్నారు అనే చెప్పాలి. అయితే ఇన్ని రోజులు ఆర్ఆర్ఆర్ సినిమా కోసమా చాలా బిజీగా గడిపిన ఎన్టీఆర్… ఆ సినిమా వచ్చి నాలుగు నెలలకు పైనే అవుతున్న తన తర్వాతి సినిమాను ఎన్టీఆర్ ఇంకా ప్రారంభించలేదు. కానీ తాను కొరటాల శివతో తన కొత్త సినిమా చేయబోతున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
కానీ కొరటాలకు తన గత సినిమా ఆచార్య ఇచ్చిన ఎఫెక్ట్ అనేది ఇనాక్ పోలేదు అని అనిపిస్తుంది. అందుకే ఆయన ఇంకా ఈ కొత్త సినిమాను ప్రారంభించడం లేదు అని తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాను ఆయన అన్న సొంత బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ లోనే నిర్మిస్తున్నాడు అనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఆ బ్యానర్ చేసిన ఓ ట్విట్ అనేది చర్చగా మారింది.
ఎన్టీఆర్ ఆర్ట్స్ తాజాగా ఫియర్ అని ట్విట్ చేసింది. కానీ ఇప్పుడు ఈ రాకమైన ట్విట్ అనేది ఎదుకు చేసిందో అర్ధం కావడం లేదు. అయితే ఎన్టీఆర్ కొరటాలతో చేస్తున్న సినిమా ఈ ఫియర్ అనే టైటిల్ పెట్టాను అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇలా ట్విట్ చేసి అందరికి హింట్ ఇచ్చింది అని ఉహించుకుంటున్నారు. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎవరికీ ఈ ఫియర్ అనేది కలిగిస్తాడు అని కూడా చర్చించుకుంటున్నారు.

Advertisement

Visitors Are Also Reading