అప్పట్లో ఎన్టీఆర్ జయలలిత కాంబోలో వచ్చిన చిత్రాలన్నీ సూపర్ హిట్టే. కానీ వీరిద్దరి కాంబినేషన్ లో గోపాలకృష్ణ ప్రొడక్షన్స్ అధినేత గోపాల కృష్ణ నిర్మించిన చిత్రం కథానాయకుడు. దీనికి కే. హేమాంబరధరరావు దర్శకుడు. రాజకీయ నేపథ్యం కలిగిన అతి కొద్ది సినిమాల్లో కథానాయకుడు ఒకటి. ఇందులో నీతి, నిజాయితీ క్రమశిక్షణ కలిగిన యువకుడిగా ఎన్టీఆర్ నటించారు. ఆయన్ను అభిమానించే ప్రేమించే యువతిగా జయలలిత నటించింది. ఇందులో రెండు పాటలను కలర్లో కూడా తీశారు. కలర్లో తీయడం అనేది ఆ రోజుల్లో ట్రెండ్.. “వయసు మళ్ళిన బుల్లోడా” పాట కోసం ప్రసాద్ స్టూడియోలో 40 వేల రూపాయలు ఖర్చు చేసి సెట్ వేశారు.. ఆ రోజుల్లో అంతటి సెట్ అంటే చాలా ఆశ్చర్యపోవాల్సిన విషయం. అప్పట్లో వారు వేసిన సెట్టు ఒక సెన్సేషనల్ గా మారింది.. దాన్ని చూడడానికి దర్శకనిర్మాతలు చాలామంది వచ్చేవారు. ఇదంతా పక్కన పెడితే కథానాయకుడు సినిమా షూటింగ్ అంతా పూర్తయింది కానీ జయలలితపై చిత్రీకరించాల్సి న “పళ్ళండి పళ్ళండి “అనే ఒక పాట కొంత ప్యాచ్ వర్క్ మిగిలింది.
also read:మందు తాగేటప్పుడు చీర్స్ ఎందుకు కొడతారో మీకు తెలుసా..?
Advertisement
1969 ఫిబ్రవరి 27న ఈ సినిమాని విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. ఫిబ్రవరి 3 నుంచి మూడు రోజులపాటు ప్యాచ్ వర్క్ పూర్తి చేయడం కోసం ఎన్టీఆర్ జయలలిత డేట్ లు ఇచ్చారు. అంతా హ్యాపీగానే సాగుతున్న సమయంలో తమిళనాడు సీఎం అన్నాదురై కన్నుమూశారు. దీంతో తమిళనాడు ఒక్కసారిగా స్తంభించిపోయింది. షూటింగ్స్ అన్నీ ఆగి పోయాయి. ఈ సమయంలో ప్యాచ్ వర్కు జరపడం అసాధ్యంగా మారింది. కానీ ఎలాగైనా జరపాలి. కారణమేంటంటే రిలీజ్ డేట్ ఇచ్చేసారు.. అంతేకాకుండా ఫిబ్రవరి 6 లోపు షూటింగ్ పూర్తి చేయకపోతే మళ్ళి ఆరు నెలల వరకు ఎన్టీఆర్ డేట్స్ లేవు. అప్పట్లో జయలలిత రాజకీయాల్లో కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అందువల్ల అన్నాదురై అంత్యక్రియలు పూర్తి అయితే కానీ ఆమె మళ్లీ షూటింగ్ వచ్చే పరిస్థితి కనబడడం లేదు. దీంతో టెన్షన్ మొదలైంది నిర్మాత గోపాలకృష్ణ కు. ఫిబ్రవరి 6 అన్నాదొరై అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆ రోజు షూటింగ్ పెట్టారు గోపాలకృష్ణ.
Advertisement
ఆ రోజు అంత్యక్రియల్లో ప్రముఖులంతా పాల్గొన్నారు జయలలిత కూడా టీ నగర్ నుండి బీచ్ వరకు కాలినడకన వెళ్ళింది. ఆమె ఎప్పుడూ షూటింగ్ స్పాట్ వస్తుందని చిత్ర యూనిట్ అంతా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ మేకప్ తో సిద్ధంగా ఉన్నారు. ఆయన గంట గంటకు ఫోన్ చేస్తుండడంతో దర్శకనిర్మాతలకు చెమటలు పడుతున్నాయి. చివరికి మధ్యాహ్నం మూడు అవుతోంది ప్రసాద్ స్టూడియోలో అడుగుపెట్టారు జయలలిత. మొత్తం 52 బిట్లు తీయాలి. దీంతో నిర్మాత గోపాలకృష్ణ ఛాయాగ్రాహకుడు వైఎస్. స్వామిని పక్కకు పిలుచుకొని రాత్రి 12 గంటల కల్లా షూటింగ్ పూర్తి చేస్తే కారు గిఫ్ట్ గా ఇస్తానని చెప్పేశారు. దీంతో రెట్టింపు ఉత్సాహంతో చాలా స్పీడ్ గా పని చేశారు స్వామి. దీనికి ఎన్టీఆర్ జయలలిత కూడా సహకారం అందించారు. రాత్రి 12 గంటలకు షూటింగ్ పూర్తి చేశారు. దీంతో వారు అనుకున్నట్లుగానే ఫిబ్రవరి 27వ తేదీన సినిమా విడుదలైంది. రెండు వారాల్లోనే 12 లక్షలకు పైగా వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.
also read: