Home » మందు తాగేట‌ప్పుడు చీర్స్ ఎందుకు కొడ‌తారో మీకు తెలుసా..?

మందు తాగేట‌ప్పుడు చీర్స్ ఎందుకు కొడ‌తారో మీకు తెలుసా..?

by Anji
Ad

సాధార‌ణంగా చాలా మందికి మ‌ద్యం సేవించే అల‌వాటు ఉంటుంది. కొంత‌మంది మందుకు బానిసై మానుకోలేక బాధ‌ప‌డుతుంటారు. మ‌రికొంద‌రూ లిమిటెడ్ గా తాగుతారు. కొంత మంది ఫ్రెండ్స్ క‌లిసినప్పుడో లేదా వీకెండ్స్‌ల‌లో తాగుతుంటారు. ఫ్రెండ్స్ పార్టీల‌లో తాగేవారు కొంత‌మంది ఉంటారు. ఇలా ఈరోజుల్లో చాలా మందికి మందు అల‌వాటు త‌ప్ప‌కుండా ఉండి ఉంటుంది. మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల చాలా ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని తాగేవారు ప‌లు సంద‌ర్భాల్లో చెబుతుంటారు.

Advertisement

ఎక్కువ తాగితే ఆరోగ్యానికి హానిక‌రం. కానీ రెండు, మూడు, పెగ్గులు రోజు తీసుకుంటే ఏమి కాద‌ని చెబుతుంటారు. తాగని వాళ్లు మాత్రం మ‌ద్యం అనారోగ్యానికి హానిక‌రం అని.. ముఖ్యంగా లివ‌ర్‌, కిడ్నీ, గుండెకు న‌ష్టం క‌లిగిస్తుంద‌ని చెబుతుంటారు. ఏది ఏమైనా మ‌ద్యం ఆరోగ్యానికి హాని క‌ర‌మే అని డాక్ట‌ర్లు చెబుతుంటారు. ఇక ఇది ప‌క్క‌న పెడితే.. మ‌ద్యం తాగేట‌ప్పుడు చీర్స్ కొట్టుకుంటారు. గ్లాస్లు తాకించి కొడ‌తారు. మందు తాగేట‌ప్పుడు చీర్స్ కొట్ట‌డం వెనుక కూడా పెద్ద చ‌రిత్ర ఉంద‌ట‌. అది ఏంటో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Also Read :  ఇట‌లీ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో గెలుపు ఎవ‌రిది..? ఆమెకే ఛాన్స్‌..!


చీర్స్ అనేది పాత ఫ్రెంచ్ ప‌దం చియ‌ర్ నుంచి వ‌చ్చింద‌ట‌. దీని అస‌లు అర్థం త‌ల అని చెబుతుంటారు. ఆనందం, ఉత్సాహం అనే భావాన్ని వ్య‌క్త‌ప‌ర‌చ‌డానికి ఈ ప‌దం ఉప‌యోగించేవార‌ట‌. చీర్స్ కొట్టేట‌ప్పుడు కొన్ని చుక్క‌ల మందు కింద ప‌డుతుంద‌ని సంతృప్తి చెందిన ఆత్మ‌ల‌కు ఉప‌శ‌మ‌నం ఇస్తుంద‌ని ఒక న‌మ్మ‌కం ఉంది. గ్లాస్‌ల శ‌బ్ధం విని దుష్ట‌శ‌క్తులు దూరంగా వెళ్లిపోతాయ‌ని జ‌ర్మ‌న్‌ల న‌మ్మ‌కం. పురాత‌న కాలంలో గ్రీస్ న‌మ్మ‌కం మ‌రోవిధంగా ఉంది. చీర్స్ అంటూ గ్లాస్‌ల‌ను పైకి ఎత్త‌డం ద్వారా దేవునికి స‌మ‌ర్పించే సంజ్ఞ అని గ్రీస్‌లో మ‌రో న‌మ్మ‌కం. ఈ జ‌ర్మ‌న్లు మ‌ద్యం తాగ‌డానికి గ్లాస్ ఎత్తిన‌ప్పుడు క‌ళ్లు, నాలుక‌, చ‌ర్మం, చెవులు, ముక్కుల‌ను ముట్టుకుంటారు. చెవుల‌కు కూడా ఆనందాన్ని క‌లిగించేందుకు చీర్స్ చెప్పుకుంటార‌ట‌. తాగే ముందు చీర్స్ చెప్పుకోవ‌డం వెనుక చాలా న‌మ్మ‌కాలున్నాయి.

Also Read :  మీ జుట్టు ఊడిపోతుందా..? అందుకు అస‌లు కార‌ణం ఇదే.. ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..!

Visitors Are Also Reading