గత కొంతకాలంగా ఏపీ రాజకీయాలు పిఆర్సి చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. కొత్త పిఆర్సి కారణంగా తమ వేతనాలు తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు దిగారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. కానీ చివరికి ప్రభుత్వం ఉద్యోగుల మధ్య రాజీ కుదిరింది. ఇదిలా ఉంటే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా 1986లో పిఆర్సి పై వివాదం నెలకొంది. పిఆర్సి కి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు నిరసనకు దిగారు. ఎన్టీఆర్ సర్కార్ 1956 జూలై 14న పిఆర్సి నివేదికను విడుదల చేసింది. పిఆర్సి కమిషన్ చేసిన సిఫారసులను ఏపీ సర్కార్ ఆమోదించింది. అయితే ఈ నివేదికలోని మూడు అంశాలపై ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు.
Also read : తమ ఫ్యాన్స్ ను పెళ్లి చేసుకున్న 5 గురు నటులు! 100% లవ్
Advertisement
ఎన్టీఆర్ ప్రభుత్వం ముందు మూడు డిమాండ్లను ఉద్యోగులు ఉంచారు… అవి 1) కొత్త పిఆర్సి ని 1986 జూలై నుండి కాకుండా జనవరి నుండి అమలు చేయాలి. 2) మినిమం బేసిక్ పే ను పెంచాలి. 3) ఇప్పటివరకు ఇచ్చిన ఇంటెరిమ్ రిలీఫ్ ను బేసిక్ పేలో కలపాలి. కానీ ఉద్యోగుల డిమాండ్లకు ఎన్టీఆర్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. అప్పటి రాష్ట్ర ఆదాయంలో 48 శాతం ఆదాయం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు ఖర్చవుతుందని…. జీతాలు పెంచే అవకాశమే లేదని స్పష్టం చేశారు. దాంతో 1986 నవంబర్ 5న ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా పాలన స్తంభించిపోయింది.
Advertisement
సమ్మె ప్రారంభమైన కొంత కాలానికి చర్చల కోసం కేబినెట్ ఉప సంఘాన్ని ప్రభుత్వం నియమించింది. కేబినెట్ ఉపసంగంతో ఉద్యోగులు చర్చలు జరిపేందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత జాతీయ భద్రతా చట్టం కింద ఉద్యమ నేతలను ఎన్టీఆర్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు రాస్తారోకోలు బంద్ లకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులందరినీ డిస్మిస్ చేస్తామని ఎన్టీఆర్ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. అంతే కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు కూడా జారీ చేసింది.
Also read : యాడ్స్‌లలో నటించడానికి ఇష్టపడని హీరోలు ఎవరో తెలుసా..?
అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు దిగిరాలేదు. అలా యాభై మూడు రోజుల పాటు సమ్మె కొనసాగింది. ఈ క్రమంలో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జోక్యం చేసుకుంది. అప్పుడు ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కు సుకోమల్ సేన్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన ఎన్టీఆర్ ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య మధ్యవర్తిత్వం వహించారు. అలా రెండు వర్గాల మధ్య రాజీ కుదిరింది. కానీ ఉద్యోగు డిమాండ్ లు మాత్రం నెరవేర్చలేదు. నో వర్క్-నో పే విధానానికి ఉద్యోగులు కట్టుబడి మళ్ళీ విధుల్లోకి చేరారు. దాంతో సుదీర్ఘకాలం పాటు జరిగిన సమ్మెకు పులిస్టాప్ పడింది.