Home » ఉగాది రోజు చేయాల్సినవి చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం..!!

ఉగాది రోజు చేయాల్సినవి చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండగను చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ పండగ హిందువు ల యొక్క మొదటి పండుగ కాబట్టి ఈరోజు పొద్దున్నే స్నానం చేసి పూజలు చేసి ఏడాదంతా మంచి జరగాలని కోరుకుంటారు. వసంత రుతువు ప్రారంభం అవగానే ప్రతి ఒక్కరిలో కొత్త చైతన్యం ఏర్పడుతుంది.. అలాంటి ఉగాది రోజు చేయాల్సిన పనులు ఏమిటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..పండితులు చెప్పిన విషయాల ప్రకారం ఉగాది రోజు కొన్ని పనులను అస్సలు చేయకూడదట మరి ఎలాంటి పనులకు దూరం ఉండాలి, ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు చూసేద్దాం..
చేయాల్సిన పనులు:

Advertisement

Also Read:ఉగాది ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏంటి?

Advertisement

ముఖ్యంగా ఉగాది రోజు కొత్త గొడుగు కొనుక్కుంటే చాలా మంచి జరుగుతుందట..అంతేకాకుండా పూర్వీకులు అయితే ఒక విసనకర్రను కూడా ఉగాది రోజు కొనుక్కునేవారు..అంతేకాదు ఉగాది రోజున కొత్త బట్టలు ధరించడం,కొత్త ఆభరణాలు వేసుకోవడం మంచిది. పేదవారికి దానం చేయాలి దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయని, పూర్వ కాలం విసనకర్రలు దానం చేసేవారు.ఉగాది రోజున దవనంతో పూజ చేయాలి.. దవనం అంటే సుగంధంతో ఉండే ఆకు . దీంతో పూజ చేస్తే చక్కటి ఫలితాలను పొందవచ్చు. అలాగే పాడ్యమినాడు బ్రహ్మకి విదియనాడు శివుడికి తదియనాడు గౌరీ శంకరులకి , చతుర్థి నాడు వినాయకుడికి పూజ చేస్తే చాలా మంచిది. ఇలా పౌర్ణమి వరకు పూజించాలి. ఉగాది పచ్చడి చేసుకొని తాగాలి. ఎందుకంటే ఉగాది పచ్చడి షడ్రుచులతో ఉంటుంది కాబట్టి తాగడం వల్ల మంచి లాభాలు ఉంటాయి.
ఉగాది నాడు చేయకూడని పనులు:

Also Read:తారకరత్న గురించి అలేఖ్య చేసిన పోస్ట్ చూస్తే బాధపడకుండా ఉండరు..!

ఉగాది రోజు ఆలస్యంగా నిద్ర లేవరాదు..మద్యం మాంసం వంటివి తినకూడదు..అలాగే దక్షిణముఖంగా కూర్చుని పంచాంగ శ్రవణం చేయకూడదు.కాబట్టి ఈ తప్పులు చేయకుండా ఉంటే మంచి జరుగుతుంది..

Also Read:దేవుడికి నైవేద్యం పెట్టే సమయంలో ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి..!

Visitors Are Also Reading