Home » ప్రపంచ కప్ లో ఈ రన్ ఔట్ జరుగుతుందా..?

ప్రపంచ కప్ లో ఈ రన్ ఔట్ జరుగుతుందా..?

by Azhar
Ad

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2022 అనేది ఈరోజు నుండి ప్రారంభమైంది. అయితే ఈ ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు ఐసీసీ కొన్ని కీలక నిర్ణయాలు.. తమ రూల్స్ లో మార్పులు అనేవి తెచ్చిన విషయం తెలిసిందే. ఇక అందులో నాన్‌- స్ట్రైయికర్ రనౌట్‌ అనేది కూడా ఉండటం గమనార్హం. బౌలర్ బౌలింగ్ చేయడానికంటే ముందే నాన్‌- స్ట్రైయికర్ క్రీజు దాటితే బౌలర్ అతడిని ఔట్ చేయవచ్చు.

Advertisement

అయితే ఈ పద్దతిని గతంలో మాన్కడింగ్ అని పిలిచేవారు. కానీ ఇక దీనిని అలా పిలవకూడదు రన్ ఔట్ అనే పిలవాలి అని ఐసీసీ పేర్కొంది. అయితే ఐసీసీ చెప్పిన తర్వాత .. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా భారత ఆల్ రౌండర్ దీప్తి శర్మ ఈ విధంగా రన్ ఔట్ చేస్తే.. అందరూ దీనిని మాన్కడింగ్ అనే పిలిచారు. అలాగే క్రీడా స్ఫూర్తి అనేదానిని తీసుకువచ్చారు.

Advertisement

ఇక తాజాగా ప్రపంచ కప్ ముందు కెప్టెన్ల ప్రెస్ మీట్ లో అందరూ కెప్టెన్లకు ఓ రిపోర్ట్రర్.. ఐసీసీ కొత్త రూల్‌ నాన్‌- స్ట్రైయికర్ రనౌట్‌ని మీరు వాడుకుంటారా అని ప్రశ్నించగా.. అందరూ పిల్ డ్రాప్ సైలెంట్ గా ఉండిపోయాడు. ఇక ఈ మౌనంలోనే సమాధానం అనేది వెతుకోవాలని కెప్టెన్లు చెప్పకనే చెప్పారు. ఒకవేళ అవసరం వస్తే మాత్రం తప్పకుండా దీనిని అందరూ వాడుతారు అని చెప్పడంలో ఏ సందేశం లేదు అని ఫ్యాన్స్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి :

ఇండియా ప్రపంచ కప్ గెలవదను గంభీర్.. ప్లీజ్..!

బీసీసీఐ ఎన్నికలు కాకపోతే CAB ఎన్నికలు అంటున్న దాదా..!

Visitors Are Also Reading