Home » టాలీవుడ్ లో సినిమాకు టైటిల్ కు అస్సలు సంబంధం లేని 10 సినిమాలు ఇవే….!

టాలీవుడ్ లో సినిమాకు టైటిల్ కు అస్సలు సంబంధం లేని 10 సినిమాలు ఇవే….!

by AJAY
Ad

సినిమా సక్సెస్ విషయంలో టైటిల్ పాత్ర కూడా ఎంతో ఉంటుంది. ముందుగా సినిమా టైటిల్ బట్టే ఆ సినిమా పై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. అయితే టాలీవుడ్లో కొన్ని సినిమాలకు అసలు కథకు… టైటిల్ కు సంబంధం లేకుండా వచ్చాయి. అంతేకాకుండా అలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం…. రాంచరణ్ హీరోగా నటించిన ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.

Advertisement

ఈ సినిమా టీవీలో ప్రసారమైన తర్వాత చాలామంది ఫిదా అయ్యారు. కానీ థియేటర్లో సినిమా చూడలేకపోయారు. ఈ సినిమా టైటిల్ కు కథకు అస్సలు సంబంధం ఉండదు. మహేష్ బాబు హీరోగా నటించిన స్పైడర్ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమా కథకు టైటిల్ కు కూడా అసలు సంబంధం లేదు. రామ్ చరణ్ శ్రీనువైట్ల కాంబినేషన్ లో బ్రూస్లీ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆశించినమేర విజయం సాధించలేదు. ఇక ఈ సినిమాకు టైటిల్ కు సైతం అస్సలు సంబంధం లేదు.

Advertisement

radhe shyam

radhe shyam

ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్… ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కట్టిన ఈ సినిమా టైటిల్ కు మరియు కథకు అస్సలు సంబంధం ఉండదు. రవితేజ కెరర్లో అతిపెద్ద డిజాస్టర్ సారొచ్చారు సినిమా…. ఈ సినిమాలో రవితేజ కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా టైటిల్ కు కథకు అస్సలు సంబంధం లేదు.

మహేష్ బాబు హీరోగా నటించిన ఖలేజా సినిమా థియేటర్లో ఆడలేదు. కానీ టీవీలో ఈ సినిమాకు ఫిదా అయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టైటిల్ కు… కథకు అసలు సంబంధం లేదు. నాగశౌర్య హీరోగా నటించిన ఛలో సినిమా మంచి విజయం సాధించింది. ఈ హిట్ సినిమాకు సైతం టైటిల్ కు కథకు సంబంధం ఉండదు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో చాలా సినిమాలు వచ్చాయి. అందులో ఐస్ క్రీం సినిమా కూడా ఒకటి. ఈ సినిమాకు కూడా కథకు టైటిల్ కు అసలు సంబంధం లేదు.

Visitors Are Also Reading