Home » బిగ్ బాస్ లో ఈ సీరియల్ హీరోయిన్ ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదా ?

బిగ్ బాస్ లో ఈ సీరియల్ హీరోయిన్ ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదా ?

by Anji
Ad

బిగ్ బాస్ 7 సీజన్ ఈమధ్య ప్రారంభమైన విషయం తెలిసిందే. దాదాపు 14 మందికి పైగా కంటెస్టెంట్స్ వచ్చినప్పటికీ అందులో చాలా మంది కొత్తవారు, జనాలకు అంతగా తెలియని వారుండటం గమనార్హం. హీరో శివాజీ, షకీలా వంటి పాత నటులు తెలిసినప్పటికీ రీసెంట్ గా క్రేజ్ తెచ్చుకున్న వాళ్లు ఈసారి రాలేదు. అందులో సీరియల్స్ కి చెందిన పలువురు నటీనటులు కూడా వచ్చారు. అలాంటి వారిలో ప్రియాంక జైన్ ఒకరు. 

Advertisement

మౌనరాగం, జానకి కలగనలేదు వంటి సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి ఫస్ట్ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు..మౌనరాగం సీరియల్ లో తనతో పాటు నటించిన శివకుమార్ తో ప్రియాంక జైన్ రియల్ లైఫ్ లో ప్రస్తుతం ప్రేమలో ఉంది. సీరియల్ హీరోయిన్ ప్రియాంకని పెద్దగా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని.. తొలుత అలిగి కూర్చుంది. పైగా రైతుబిడ్డ పల్లవి, ప్రశాంత్, మరో అమ్మాయి రాతిక ని నామినేట్ చేస్తూ.. రీజన్ కూడా అదే చెప్పింది. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న ప్రియాంక బిగ్ బాగ్ లో చాలా రోజుల వరకు కంటిన్యూ అయ్యే అవకాశముంది. ఆడియన్స్ కి ఓట్లు కూడా అమ్మాయిల్లో తనకే ఎక్కువగా వచ్చే అవకాశముంది. 

Advertisement

ఇకపోతే ప్రియాంక నటించిన జానకి కలగనలేదు సీరియల్ హీరో అమర్ దీప్ కూడా తనతో పాటు బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వడంతో బిగ్ బాస్ లో వీరిద్దరూ ఒక జట్టయ్యే అవకాశం లేకపోలేదు. బిగ్ బాస్ ఫస్ట్ వీక్ లో హీరో శివాజీ డామినేషన్ ఫుల్ గా కనిపిస్తుందనే విషయం తెలిసిందే. వాస్తవానికి శివాజీ బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ లోనే ఎంట్రీ ఇవ్వాల్సింది. కానీ అప్పట్లో రాజకీయాలపై ఆసక్తి ఉండి చాలా బిజీగా ఉండటం వల్ల ఆయనకు కుదరలేదు. అక్కడ కూడా అంతగా గుర్తింపు లేకపోవడంతో బిగ్ బాస్ ని నమ్ముకొని పాపులర్ అవుదామని చూస్తున్నాడు శివాజీ.  మరోవైపు మేల్ పర్సన్స్ లో శివాజీ సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ కావడం విశేషం. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు: 

పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన అనుష్క.. కచ్చితంగా అప్పుడే..!

ఛాన్స్ ఇస్తే బాలయ్యతో అలా చేయాలని ఉంది.. శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Visitors Are Also Reading