Home » పెళ్లి కాకుండానే తల్లికాబోతున్న నిత్యామీనన్…? వైరల్ అవుతున్న బేబీ బంప్ ఫోటోలు…!

పెళ్లి కాకుండానే తల్లికాబోతున్న నిత్యామీనన్…? వైరల్ అవుతున్న బేబీ బంప్ ఫోటోలు…!

by AJAY
Published: Last Updated on
Ad

అల మొదలైంది సినిమాతో టాలీవుడ్ లో అభిమానులు సంపాదించుకున్న హీరోయిన్ నిత్యామీనన్. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి నిత్యామీనన్ ప్రేక్షకులను అలరించింది. ఇష్క్ సినిమాతో నిత్యామీనన్ ఫాలోవర్ల సంఖ్య పెరిగిపోయింది. ఇక గ్లామర్ కు దూరంగా ఉండే హీరోయిన్లలో నిత్యామీనన్ కూడా ఒకరు. నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలోలనే నటిస్తూ నిత్య నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ ఆకట్టుకుంటుంది.

Advertisement

ప్రస్తుతం నిత్యామీనన్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లోనూ నటిస్తోంది. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో నిత్యామీనన్ తీరు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొంతకాలం క్రితం నిత్యామీనన్ తన సోషల్ మీడియాలో ప్రెగ్నెన్సీ కిట్ ను షేర్ చేసింది దాంతో అంతా అవాక్కయ్యారు. అంతేకాకుండా ఆ తర్వాత కొద్ది రోజులకు ప్రెగ్నెన్సీ కి సంబంధించిన వీడియోలను సైతం షేర్ చేసింది.

Advertisement

ఆ వీడియో చూసిన నెటిజన్లు నిత్యా కాకుండానే ప్రెగ్నెన్సీ గురించి ఎందుకు మాట్లాడుతుంది అని చర్చించుకున్నారు. అంతేకాకుండా సరోగసి ద్వారా ఏమైనా బిడ్డను కంటుందా అని చర్చించుకున్నారు. కాగా ఇప్పుడు నిత్యామీనన్ బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను షేర్ చేసి నెటిజన్లను షాక్ అయ్యేలా చేసింది. ఈ ఫోటోల కింద క్యాప్షన్ చదివిన వారికి మాత్రం అసలు మ్యాటర్ అర్థమవుతుంది. నిత్యామీనన్ తన రాబోయే సినిమాలో ప్రెగ్నెంట్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగానే నిత్యామీనన్ గత కొద్ది రోజులుగా ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా షేర్ చేసిన ఫోటోలకు నిత్యామీనన్ ప్రెగ్నెన్సీ ఎప్పుడూ అందంగా కనిపించదు. కానీ ఆ పోషించడం నాకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని ఫోటోలను షేర్ చేస్తాను. అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Visitors Are Also Reading