తొమ్మిదేళ్ల వయస్సులోనే ఆ బుడతడు యోగా గురువుగా మారిపోయాడు. అతి పిన్న వయసు యోగా గురువుగా అతన్ని గుర్తిస్తూ ప్రతిష్టాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులలో అతనికి స్థానం కల్పించింది. భారత్‌కు చెందిన తొమ్మిదేళ్ల రేయాన్స్ సురాని కుటుంబం ప్రస్తుతం iలో ఉంటుంది. నాలుగేండ్ల వయస్సు నుంచే రేయాన్ష్ తల్లిదండ్రులతో కలిసి భారత్‌లోని రిషికేశ్‌లో యోగాను సాధన చేయడం ప్రారంభించాడు. 200 గంటల యోగా టీచర్స్ ట్రైనింగ్ కోర్సును పూర్తి చేసిన రేయాన్ష్.. గత ఏడాది జులై 27న ఆనంద్ శేఖర్ యోగా పాఠశాల నుంచి యోగా గురువు ధ్రువపత్రాన్ని అందుకున్నారు.
Also Read : ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్‌లో భారత్ మరో రికార్డు
Advertisement
ఈ విషయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ తన వెబ్ సైట్‌లో వెల్లడించింది. కోర్సు సమయంలో రేయాన్ష్ యోగాకకు సంబంధించి అనేక మెలుకువలను నేర్చుకున్నాడు. యోగాలోని ఆన్‌లైన్‌మెంట్ అనాటమిక్ ఫిలాసపీ ఆయుర్వేదంలోని వాస్తవాలు ఇలా పలు అంశాలను నేర్చుకున్నాడు రేయాన్ష్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. యోగా పట్ల నాకు ఉన్న అభిప్రాయాన్ని ఈ కోర్సు మార్చేసింది. యోగా అనేది శారీరక భంగిమలు శ్వాస గురించి మాత్రమే అనుకున్నాను.
Advertisement
కానీ అది దాని కంటే చాలా ఎక్కువ అని గ్రహించానని తెలిపారు. ప్రస్తుతం పెద్దలతో పాటు పిల్లలకు కూడా యోగా నేర్పిస్తున్నాడు రేయాన్స్. రాబోయే రోజుల్లో వర్చువల్ రియాలిటీ తరగతులు కూడా నిర్వహిస్తామని బాలుడు పేర్కొన్నాడు. కరోనా నిబంధనల కారణంగా కొద్ది మందికే శిక్షణ అందిస్తున్నానని పాఠశాలలోను ప్రతి సెషన్‌లో 10-15 మంది పిల్లలకు యోగా మెలకువలు నేర్పిస్తున్నట్టు తెలిపారు. గిన్నిస్ బుక్ స్థానం సంపాదించడంపై రేయాన్ష్ ఆనందం వ్యక్తం చేశాడు. నాకు నేను ఇప్పుడు ఓ స్టార్‌లో కనిపిస్తున్నా అని సంబురపడ్డాడు. రేయాన్స్ యోగా సాధన చేస్తున్న ఓ యూట్యూబ్ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ షేర్ చేసింది.
Also Read : 21st feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!