Home » 21st feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

21st feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad
INDIA CORONA UPDATE

INDIA CORONA UPDATE

దేశంలో కరోనా కేసులు భారీగా త‌గ్గాయి. తాజాగా 16,051 కేసులు న‌మోద‌య్యాయి. 206 మంది క‌రోనాతో మ‌ర‌ణించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్ర‌క‌టించింది. ప్రస్తుతం దేశంలో మొత్తం 2,02,131 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఏపీ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి గుండెపోటుతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. కాగా ఇప్ప‌టికే ప‌లువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఆయ‌న నివాసానికి చేరుకున్నారు. ఇక‌ ఏపీ సీఎం జగన్ హైద‌రాబాద్ చేరుకుని మేకపాటి గౌతమ్‌రెడ్డికి నివాళులర్పించ‌నున్నారు. ఇప్పటికే అపోలో ఆస్పత్రికి వైఎస్ విజయమ్మ, షర్మిల చేరుకున్నారు.

Advertisement

మ‌ళ్లీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా త‌గ్గాయి. ఆదిలాబాద్ జిల్లా అర్లిటి లో 10 డిగ్రీల ఊష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. బజార్ హత్నూర్ లో 10.7 డిగ్రీలు, బేలాలో 12 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంబి లో 12.3. గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోద‌య్యాయి.

కర్ణాటకలో రాష్ట్రంలో ఉద్రిక్తత వాతావ‌ర‌ణం నెల‌కొంది. శివమొగ్గ జిల్లాలో బజరంగ్ దళ్ కార్యకర్త దారుణ హత్యకు గుర‌య్యారు. ఈ నేప‌థ్యంలోనే అక్క‌డ ఉద్రిక్త‌త నెల‌కొంది.

Advertisement

Ap cm jagan

Ap cm jagan

ఏపీ ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం సీసీఏను పున‌రుద్ద‌రించింది. జ‌న‌వ‌రి 17న ప్ర‌భుత్వం సీసీఏను ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఉద్యోగుల ధ‌ర్నాతో ప్ర‌భుత్వం దిగివ‌చ్చింది.

తెలంగాణ‌లో బంజారా బిడ్డ‌లే అత్యాచారానికి గుర‌వుతున్నారంటూ బీఎస్పీ నేత ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ఎస్ పాల‌న‌లో బ‌హుజ‌నుల‌కు అన్యాయం జ‌రిగింద‌న్నారు. ప్రైవేటు యూనివ‌ర్సిటీల్లో రిజ‌ర్వేష‌న్లు లేకుండా చేశార‌ని అన్నారు.

శ్రీశైలంలో రేప‌టి నుండి శివ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం కానున్నాయి. భ‌క్తుల సౌక‌ర్యార్థం ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుద్దీప‌కాంతుల‌తో ఆల‌యం మెరిసిపోతుంది.

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ను అభివృద్ది చేసే దిశ‌గా కేంద్రం ప‌నిచేస్తుంద‌ని ప్ర‌ధాని మోడీ వెల్ల‌డించారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్ర 36వ అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంధ‌ర్భంగా మోడీ రాష్ట్ర‌ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు చెప్పారు.

కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అకిల ప్రియ స‌హా 37మందిపై చార్జి షీట్ న‌మోదైంది. గతేడాది జ‌న‌వ‌రి 5న ప్ర‌వీణ్ రావు అయన సోద‌రుడి కిడ్నాప్ సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే.

బీజేపీ రాజ‌ధ‌ర్మం మ‌ర్చిపోయింద‌ని కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. యూపీ ఎన్నిక ప్ర‌చారంలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ వారిందంతా పెద్ద‌ల సేవే అని అన్నారు.

Visitors Are Also Reading