హ్యాపీడేస్ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో నికిల్. ఆ సినిమాలో హీరోగా చేయకపోయినా తన నటనతో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇటీవలే కార్తీకేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం 18 పేజీస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. వరుసగా భారీ చిత్రాలను చేస్తున్న హీరో నిఖిల్ వ్యక్తి గత జీవితంలో పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. నిఖిల్ తన భార్య పల్లవి వర్మ తో విడిపోయి దూరంగా ఉంటున్నాడని, కొన్ని కారణాల వల్ల వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్టు సమాచారం.
Advertisement
వీరిద్దరి మధ్య పుకార్లు భారీ ఎత్తున వినిపిస్తున్నాయి. ఇరు కుటుంబాల పెద్దలు ఎంత చెప్పినా ఒప్పించే ప్రయత్నం చేసినా కూడా నిఖిల్, పల్లవి వర్మలు కలిసి ఉండేందుకు ఇష్టపడడం లేదంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు వాస్తవం కాదని ఆ మధ్య వచ్చిన ఓ టాక్ షోలో నిఖిల్ క్లారిటీ ఇచ్చేశాడు. అలాంటిది ఏమి లేదని తెలిపాడు. సోషల్ మీడియాలో ఆ వార్తలు తెగ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక ఆ టాక్ షోలో నిఖిల్ తన భార్య పల్లవి వర్మతో తన లైఫ్ చాలా బాగుందని చెప్పుకొచ్చాడు.
Advertisement
పల్లవి వర్మతో తాను అద్భుతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నట్టు తెలిపారు. తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చాడు. సోషల్ మీడియాలో తన భార్యతో ఒక ఫోటోని దిగి నువ్వు నా పక్కన ఉన్న ప్రతిసారి కూడా అద్బుతమే అన్నట్టుగా భార్య పేరు ట్యాగ్ చేశాడు. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీరిద్దరూ కలిసే ఉన్నారు. విడాకులకు సంబంధించిన రూమర్స్ అనేవి వాస్తవం కాదని ఈ పోటో చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది.
Also Read : నటుడు రవిప్రకాష్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా..? ఫస్ట్ ఆఫర్ ఎలా వచ్చిందంటే..?