Home » ర‌మేష్ బాబు కొడుకు కూతురు ఎంత అందంగా ఉన్నారో చూశారా..? వాళ్లు ఏం చేస్తున్నారంటే..?

ర‌మేష్ బాబు కొడుకు కూతురు ఎంత అందంగా ఉన్నారో చూశారా..? వాళ్లు ఏం చేస్తున్నారంటే..?

by AJAY
Ad

సూప‌ర్ స్టార్ కృష్ణ పెద్ద‌కుమారుడు ర‌మేష్ బాబు ఈ ఏడాది జ‌న‌వ‌రిలో అనారోగ్యంతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. నిజానికి ర‌మేష్ బాబును సైతం కృష్ణ స్టార్ హీరోగా చూడాల‌ని అనుకున్నారు. ర‌మేష్ బాబు కూడా ఎంతో క‌ష్ట‌ప‌డి సినిమాల్లో న‌టించారు. కానీ సినిమాల్లో రానించాలంటే బ్యాగ్రౌండ్ తో పాటూ అదృష్టం కూడా క‌లిసి రావాలి. దాంతో స‌రైన హిట్ లు ప‌డ‌క‌పోవ‌డంతో ర‌మేష్ బాబు హీరోగా సినిమాల‌లో న‌టించ‌డానికి గుడ్ బై చెప్పారు. కానీ సినిమా ఇండ‌స్ట్రీకి మాత్రం పూర్తిగా దూరం అవ్వ‌లేదు.

Advertisement

త‌మ బ్యాన‌ర్ పై ర‌మేష్ బాబు నిర్మాత‌గా మారి సినిమాలు చేశారు. ముఖ్యంగా మ‌హేశ్ బాబుతోనే ర‌మేశ్ బాబు ఎక్కువ సినిమాలు నిర్మించారు. ఆ త‌ర‌వాత ఏం జ‌రిగిందో కానీ సినిమాలు నిర్మించ‌డం కూడా ఆపేసి ఇత‌ర వ్యాపారాల‌ను చూసుకున్నారు. అయితే ర‌మేశ్ బాబు హీరోగా ఎద‌గాల‌ని కృష్ణ ఎంతో కోరుకున్నార‌ట‌. కానీ ఆయ‌న ముందే కొడుకు చ‌నిపోవ‌డంతో ఎంతో బాధ‌ప‌డ్డార‌ట‌.

Advertisement

అయితే ర‌మేశ్ బాబు కుమారుడిని మాత్రం స్టార్ హీరోను చేయాల‌ని కృష్ణ అనుకున్నార‌ట‌. ర‌మేశ్ బాబు మృదులను వివాహం చేసుకున్నారు. ర‌మేశ్ బాబు మృదుల జంట‌కు ఓ కూతురు మరియు కుమారుడు ఉన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా కృష్ణ చిన్న క‌ర్మ జ‌ర‌గ్గా మ‌హేశ్ బాబు త‌న వ‌దిన మ‌రియు ర‌మేశ్ బాబు కూతురు, కొడుకుతో ఫోటోలు దిగారు.

గ‌తంలో ర‌మేష్ బాబు కూతురు కొడుకును నెటిజన్లు ఎప్పుడూ చూడలేదు. కాగా ఇప్పుడు ర‌మేష్ బాబు కూతురు మ‌రియు కొడుకు అందం చూసి మురిసిపోతున్నారు. ఇప్ప‌టికే ర‌మేష్ బాబు కొడుకు అమెరికాలో న‌ట‌న‌లో మెల‌కువ‌లు నేర్చుకుంటుండ‌గా కూతురు విదేశాల్లో ఉన్న‌త చ‌దువులు చ‌దువుత‌న్న‌ట్టు తెలుస్తోంది.

Visitors Are Also Reading