Nikhil Siddhartha : టాలీవుడ్ హీరో నిఖిల్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. నిఖిల్ ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఎంతో మంచి ఆదరణ ని సంపాదించుకున్నారు ప్రస్తుతం ఈయన స్వయంభూ సినిమాలో నటిస్తున్నారు. కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ ని అందుకున్న నిఖిల్ ప్రస్తుతం స్వయంభు సినిమాని కూడా స్థాయిలోనే ప్రేక్షకులు ముందుకి తీసుకురావాలని చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొని నిఖిల్ ఆసక్తికరమైన విషయాలని పంచుకున్నారు.
Advertisement
ఇంటర్వ్యూలో భాగంగా స్వయంభూ సినిమా విడుదల తేదీ గురించి అలానే తన కొడుకు గురించి కూడా కొన్ని విషయాలని పంచుకున్నారు. 2021లో పల్లవి అనే డాక్టర్ ని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇటీవల ఒక కొడుకు పుట్టాడు తన కుమారుడికి సంబంధించి ఫోటోలని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. తాజాగా తన కొడుకు గురించి మాట్లాడుతూ తనకి బాబు పుట్టడం తర్వాత ఎక్కువ సమయం తనకి కేటాయిస్తున్నానని అన్నారు.
Advertisement
Also read:
Also read:
కొడుకు పేరు ధీర సిద్ధార్ద్ అని చెప్పారు కొడుకు చాలా త్వరగా పెరుగుతున్నారు అనిపిస్తుందని అన్నారు. పిల్లవాడి బాధ్యతను పెంచుకోవడానికి నా ప్రయత్నం చేస్తున్నానని వారానికి ఒక్కసారైనా పార్టీకి వెళ్లడం నాకు అలవాటుగా ఉండేది బాబు పుట్టిన తర్వాత ఈ అలవాటుని మానుకున్నానని మన పిల్లలకి మంచి వాతావరణం లో పెంచాలని మనలో కొన్ని మార్పులు చేసుకోవడం ముఖ్యమని నిఖిల్ చెప్పారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!