తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. 2014 నుంచి ఇప్పటివరకు కేసీఆర్ సర్కార్ అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చి విజయవంతంగా అమలు చేస్తోంది. ఈ తరుణంలోనే బీసీలకు అండగా నిలిచేందుకు మరో పథకాన్ని తీసుకువచ్చారు సీఎం కేసీఆర్. దీనికి ఇవాళ శ్రీకారం పుట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
Advertisement
ఈ పథకం పేరే బీసీ కులవృత్తులకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం. బీసీ కులవృత్తులు మరియు చేతివృత్తులపై ఆధారపడిన వారికి ఏకంగా లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించేందుకు ఈ స్కీం ప్రారంభించారు. ఇందుకోసం రూపొందించిన వెబ్ సైట్ ను ఇవాళ తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఇక ఈ పథకం కోసం https://tsobmmsbc.cgg.gov.in ఈ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Advertisement
ఈనెల 9వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేతుల మీదుగా మంచిర్యాల జిల్లాలో లక్ష రూపాయల ఆర్థిక సహాయం పంపిణీ ప్రారంభిస్తారు. అదే రోజు అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు మరియు ఎమ్మెల్యేల చేతుల మీదుగా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి ఫోటో, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలు అవసరం. పై వెబ్సైట్ ద్వారా తక్షణమే దరఖాస్తు చేసుకోవాలి.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
నటి మహేశ్వరికి…శ్రీదేవికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా….?
అఖిల్ ను ‘అయ్యగారు’ అని ఎందుకు పిలుస్తారు ?
బొమ్మరిల్లు సినిమాకి “సిద్దార్థ్” విషయంలో ఇంత అన్యాయం జరిగిందా ? మూవీ బ్లాక్ బస్టర్ కానీ..?