ఇరవై ఆరేళ్ల కాలం నుంచి ఈ ప్రొఫెషన్‌లో ఉన్నాను కాబట్టి అది నా బాధ్యత అవుతుంది. ముఖ్యంగా నేను కంపోజ్‌డ్ గా ఉండటం అనేది నా బాధ్యత నేను లైఫ్‌లో ఎంత కంపోజ్‌డ్ గా ఉంటే మనం అంతగా రాణిస్తామని అది నా ఫిలాసపి. ఎవరి ఫిలాసపి వారికి ఉంటుంది. నాకు విల్ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు కూడా తెలియదు. ఇండస్ట్రీలో చాలా మందిని పోగొట్టుకున్నాం. ముఖ్యంగా నా జీవితంలో అతిముఖ్యమైన వ్యక్తి ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం ఆయన చనిపోవడం నన్ను కలిచి వేసింది.
ఆయనను మరిచిపోయిన కొద్ది రోజులకే మళ్లీ సీతారామశాస్త్రీ గారు మరణించడం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు. జరగకూడనివి చాలా జరిగాయి. వారి జ్ఞాపకాలతో వారు చూపించిన మార్గంలో వెళ్లడం వారికి మనమిచ్చే గౌరవం అన్నారు. పెళ్లి తరువాత మీ లైఫ్ ఏ విధంగా ఉందని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సింగర్ సునిత ఈ విధంగా సమాధానం చెప్పింది. నేను ప్రస్తుతం ఏ విధంగా ఉన్నానో నా జీవితం కూడా అదేవిధంగా ఉందని పేర్కొంది. చాలా విషయాల్లో నేను చాలా సైంలెంట్‌గా ఉన్నాను.
Advertisement
Advertisement
Also Read : రజినికాంత్ స్టోరీ అందించిన రాయలసీమ రామన్నచౌదరి ఎందుకు ప్లాప్ అయిందంటే..?
ఎవరు ఎందుకు అన్నారో తెలియదు. ఎందుకు కన్వీన్స్ అయ్యారో తెలియదు. ముఖ్యంగా కొందరూ ఎందుకు ప్రేమిస్తారో తెలియదు. ఎందుకు బెదిరిస్తారో తెలియదు. వాటిని వదిలేసి వాటన్నింటిని నేను ఒక కూతురిగా, ఒక తల్లిగా, నా పరిధి ఏమిటో నాకు తెలుసు, నేను ఏమి ఏమి చేయగలనో తెలుసు. నా గురించి నేను గొప్పగా ఫీల్ అయ్యేలా చేస్తుంటాను. ఈ మధ్య కాలంలో దాదాపు 17 సినిమాలకు పాటలు పాడాను. పెద్ద, చిన్న హీరోలు అని తేడా లేకుండా మంచి పాట బయటికొస్తే ఆదరిస్తే ఎలా ఉంటుందో నీలి నీలి సాంగ్ రుజువు చేసిందని చెప్పారు.
ఇప్పటివరకు చాలా మంచి పాటలు పాడాను. ఇంకా పాడుతాను. ఐపీఎల్ మూవీలో ఎవరిది ఈ ప్రేమ హృదయం అనే సాంగ్ నాకు చాలా నచ్చిందని చెప్పారు. దీంతో పాటు BRO సినిమాలో అన్నయ్య నువ్వు పిలిస్తే చెల్లి రాదా అనే సాంగ్ నచ్చిందని చెప్పుకొచ్చారు సింగర్ సునిత.
Also Read : Sampath raj : విడాకుల తరవాతే నాకు అవకాశాలు వచ్చాయి…మిర్చి విలన్ హాట్ కామెంట్స్…!