Telugu News » sampath raj : విడాకుల త‌ర‌వాతే నాకు అవ‌కాశాలు వ‌చ్చాయి…మిర్చి విల‌న్ హాట్ కామెంట్స్…!

sampath raj : విడాకుల త‌ర‌వాతే నాకు అవ‌కాశాలు వ‌చ్చాయి…మిర్చి విల‌న్ హాట్ కామెంట్స్…!

by AJAY MADDIBOINA

టాలీవుడ్ లో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు సంప‌త్ రాజ్. మిర్చి సినిమాతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన సంప‌త్ రాజ్ విల‌న్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. వ‌రుస సినిమాలు చేస్తూ ఇండ‌స్ట్రీలో బిజీ న‌టుడిగా మారిపోయారు. బ‌డా హీరోల‌ను ఢీకోట్టే పాత్ర‌ను సంప‌త్ రాజ్ ద‌క్కించుకుంటున్నారు. ఇదిలా ఉండ‌గా తాజాగా సంప‌త్ రాజ్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే టాక్ షోకు హాజ‌ర‌య్యారు. ఈ సంధ‌ర్బంగా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ఆయ‌న పంచుకున్నారు.

Ads
sampath raj

sampath raj

త‌న ఫ్యామిలీ లైఫ్ గురించి కూడా అనేక విష‌యాల‌ను సంప‌త్ రాజ్ బ‌య‌ట‌పెట్టారు. చూడ్డానికి నార్త్ నుండి వ‌చ్చిన విలన్ లా క‌నిపించే సంప‌త్ రాజ్ నిజానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందినాడే. సంప‌త్ రాజ్ తండ్రి ఏపీలోని నెల్లూరు వాసి…అంతే కాకుండా త‌న త‌ల్లి ఎనిమిది భాష‌లు మాట్లాడేద‌ని సంప‌త్ రాజ్ వెళ్ల‌డించారు. సినిమాలు అంటే త‌న త‌ల్లికి ఇష్టం లేద‌ని హీరో అవుతా అంటే కొట్టేవారని చెప్పారు.

అంతే కాకుండా త‌న తండ్రితో క‌లిసే తాను సిగ‌రెట్ తాగేవాడినని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు. త‌ను 20 ఏళ్ల వ‌య‌సులో ఉన్న‌ప్పుడే సినిమాల్లోకి రావానుకున్నాన‌ని కానీ అప్పుడు అవ‌కాశాలు రాలేద‌ని అన్నారు. త‌న‌కు విడాకులు వ‌చ్చే స‌మ‌యంలో సినిమా అవ‌కాశాలు వ‌చ్చాయ‌ని చెప్పారు. త‌న భార్య శృతిని త‌న‌కు ఐదేళ్లు సినిమాలు చేసుకునేందుకు స‌మ‌యం అడిగాన‌ని ఆ త‌ర‌వాత క‌లిసి ఉందామ‌ని చెప్పాన‌ని అన్నారు.

ALSO READ : మోహ‌న్ బాబు నివాసానికి మంత్రి పేర్నినాని..కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌..!

ఇక ప్ర‌స్తుతం త‌న‌కు ఓ కూతురు ఉంద‌ని కూతురే త‌న స‌ర్వ‌స్వం అని అన్నారు. ఇక ఇప్పుడు మ‌రో పెళ్లి చేసుకోవాలంటే త‌న‌కు భ‌యంగా ఉంద‌ని సంప‌త్ రాజ్ వ్యాఖ్యానించారు. త‌న కూతురు కూడా పెళ్లి చేసుకోమ‌ని చెబుతుంద‌ని కానీ తాను పెళ్లికి దూరంగా ఉన్నాన‌ని అన్నారు. త‌ను ఎప్పుడూ హీరో అవ్వాల‌ని అనుకోలేద‌ని మంచి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అవ్వాల‌ని అనుకున్న‌ట్టు తెలిపారు.


You may also like