Home » వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇకపై తప్పుడు సమాచారానికి చెక్..!

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇకపై తప్పుడు సమాచారానికి చెక్..!

by Anji
Ad

యూజ‌ర్ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్ల‌ను అందిస్తున్న వాట్సాప్ మ‌రొక ఫీచ‌ర్‌ను త్వ‌ర‌లో అందుబాటులోకి తేనున్న‌ది. ఈ ఫీచ‌ర్ సాయంతో గ్రూప్ అడ్మిన్‌గా ఉన్న వ్య‌క్తులు గ్రూప్ స‌భ్యులు షేర్ చేసే సందేశాల‌ను సులువుగా తొల‌గించ‌వ‌చ్చు.


గ్రూప్ లో ఎవ‌రైనా త‌ప్పుడు స‌మాచారాన్ని షేర్ చేస్తే.. గ్రూప్ అడ్మిన్ స‌ద‌రు మెసేజ్‌ను డెలీట్ చేయ‌వ‌చ్చు. దీంతో గ్రూప్ స‌భ్యుల‌కు అడ్మిన్ త‌మ సందేశాన్ని డెలీట్ చేసిన‌ట్టు చాట్ స్క్రీన్ పై క‌నిపించ‌నున్న‌ది. ప్ర‌స్తుతం టెస్టింగ్ ద‌శ‌లో ఉన్న ఈ ఫీచ‌ర్‌ను త్వ‌ర‌లో ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజ‌ర్ల‌కు అందుబాటులోకి రానున్న‌ది.

Advertisement

Advertisement

మ‌రొక వైపు వాట్సాప్ ఎట్ట‌కేల‌కు రియాక్ష‌న్స్ ఫీచ‌ర్‌ను యూజ‌ర్ల‌కు అందుబాటులోకి తేనున్న‌ది. తొలుత యూజ‌ర్లు రియాక్ష‌న్ సందేశం పంప‌డానికి ఆరు ఏమోజీలు పొంద‌వ‌చ్చు. లైక్‌, ల‌వ్‌, లాప్‌, స‌ర్‌ప్రైజ్‌, శాడ్, థ్యాంక్స్ ఎమోజీలు ఈ జాబితాలో ఉన్నాయి. అన్ని ర‌కాల ఏమోజీలు వాడే అవ‌కాశం భ‌విష్య‌త్‌లో రావ‌చ్చు. వాటిలో కొన్ని బీటీ టెస్టింగ్‌కు వినియోగిస్తున్నారు. దీనికి అద‌నంగా యాప్‌లోని జిఫ్‌లు, స్టిక్క‌ర్లు కూడా యూజ‌ర్లు వినియోగించ‌వ‌చ్చు.

Also Read : 

Intinti Gruhalakshmi 06 May Today Episode : ఓ వైపు లాస్య ఉగ్ర‌రూపం.. మ‌రోవైపు తుల‌సి తెగింపు.. అంతలోనే అస‌లు ట్విస్ట్‌..!

టీవీ9 దేవి నాగవల్లికి కనీసం రెండేళ్లు జైలు శిక్ష పడే ఛాన్స్ ఎందకో తెలుసా ?

Visitors Are Also Reading