Ad
ఒక్కపుడు ప్రజలు డబ్బులు అనేవి విత్ డ్రా చేయాలి అనుకుంటే బ్యాంకుల ముందు క్యూ కట్టాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఆ తర్వాత వచ్చిన ఏటీఎం సర్వీస్ అనేది ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈ ఏటీఎం సర్వీస్ ను ఉపయోగించుకొని ప్రజలు ఎలాంటి కష్టం అనేది లేకుండా నిమిషాల వ్యవధిలో డబ్బు అనేది తీస్తూ.. తమ పనులను చేసుకుంటున్నారు. అయితే ప్రజల సౌకర్యం కొత్త తెచ్చిన ఈ ఏటీఎం సర్వీసులను కేటుగాళ్లు తమ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. ప్రజలను మోసం చేస్తూ డబ్బులు కొట్టేస్తున్నారు.
ఒక వ్యక్తి యొక్క ఏటీఎం కార్డు అనేది ఏ కేటుగాడు చేతికి అయిన చిక్కితే అందులో నుండి మొత్తం డబ్బు అనేది తామా తెలివి తేటలను ఉపయోగించి కొట్టేసుతున్నారు. ఇలా చాలా మంది ప్రజలు తమ డబ్బు అనేది పోగొట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ రకమైన మోసాలకు చెక్ పెట్టేందుకు ఎస్బిఐ బ్యాంక్ ఓటీపీ సిస్టమ్ ను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సిస్టమ్ ప్రకారం ఎవరైనా ఎస్బిఐ యూజర్.. తన కథ నుండి ఏటీఎం ద్వారా డబ్బులు విత్ డ్రా చేయాలనీ అనుకుంటే.. వారి రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు మెసేజ్ వస్తుంది. అప్పుడు పిన్ తో పాటుగా ఆ ఓటీపీ ని కూడా ఎంటర్ చేస్తేనే డబ్బు అనేది వస్తుంది.
అయితే ఎస్బిఐ ఈ పద్దతిని తీసుకువచ్చి ఇప్పటికే రెండు సంవత్సరాలు అవుతుంది. 2020 జనవరి 1 నుండే ఈ పద్దతిని వాడుతుంది ఎస్బిఐ. దీని వల్ల చాలావారకు మోసాలు అనేవి అరికట్టవచ్చు. దాంతో ఇప్పుడు మిగిలిన బ్యాంకులు కూడా ఏటీఎం విత్ డ్రా విషయంలో ఇదే సిస్టమ్ ను వడబోతున్నట్లు తెలుస్తుంది. ఏ యూజర్ అయిన ఏటీఎం నుండి పది వేల కంటే ఎక్కువ డబ్బును తీయాలి అని చూస్తే.. అతనికి ఒక్క ఓటీపీ అనేది వస్తుంది. దాని ద్వారానే అతను డబ్బు అనేది విత్ డ్రా చేయవచ్చు. ఇక ఈ ఓటీపీ కేవలం ఒక్కసారి నిర్ణిత సమయం వరకే ఉంటుంది. ఇక ఈ పద్దతి ద్వారా ఏటీఎం అనేది కేటుగాళ్లకు చీకినా కూడా తక్కువ మొత్తంలో పోగొట్టుకునే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
ఇండియా విజయానికి సంజూనే కారణం..!
అందుకే భారత్ ప్రపంచ కప్స్ ఓడిపోయింది..!
Advertisement