Home » ఐకూ నుంచి కొత్త 5జీ స్మార్ట్ ఫోన్.. అద్భుతమైన ఫీచర్స్..!

ఐకూ నుంచి కొత్త 5జీ స్మార్ట్ ఫోన్.. అద్భుతమైన ఫీచర్స్..!

by Anji
Ad

చైనాకి చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ ఐకూ కొత్త ఫోన్ ని లాంచ్ చేయబోతుంది. ఐకూ11 పేరుతో తీసుకొస్తున్న 5జీ స్మార్ట్ ఫోన్ ని డిసెంబర్ 02న మలేషియాలో లాంచ్ చేయనున్నారు. త్వరలోనే భారత్ లో కూడా విడుదల కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ తక్కువ బడ్జెట్ లో తీసుకురాబోతున్నట్టు సమాచారం. ఇందులో శక్తివంతమైన స్నాప్ డ్రాగన్ 8జెన్ 2 ప్రాసెసర్ ని అందించారు. భారత్ లో ఈ ఫోన్ ను 2023 జనవరిలో విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. 

Advertisement

ఐకూ స్మార్ట్ ఫోన్ ను 8 జీబీ ర్యామ్ +12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ వేరియెంట్లలో తీసుకురానున్నారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లను పరిశీలించినట్టయితే.. ఇందులో 6.78 ఇంచెస్ ఈ6 ఎల్ఈడీ డిస్ప్లే ని అందించనున్నారు. 1440 రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. స్నాప్ డ్రాగన్ 8 gen 2 ప్రాసెసర్ తో పని చేసే ఈ ఫోన్ లో ఆండ్రాయిన్ 13 ారిజిన్ ఓఎస్ 3.0 స్కిన్ ని ఇవ్వనున్నారు. ఇక కెమెరాకు కూడా ఈ స్మార్ట్ ఫోన్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 

Advertisement

Also Read :   గుడ్ న్యూస్:16 ఏళ్లకే ఓటు హక్కు..!!

Manam News

కెమెరా విషయానికొస్తే.. ఇందులో ట్రిపుల్ కెమెరాను అందించారు. రెయిర్ కెమెరా మొత్తం 3 కెమెరాలతో రూపొందించారు. వీటిలో ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్ కాగా.. ఇతర రెండు కెమెరాలను 13, 12 మెగా పిక్సెల్స్ కెమెరా ఇచ్చారు. సెల్పీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. బ్యాటరీ విషయానికి వస్తే.. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో 5000mAh బ్యాటరీని అందించారు. ధర విషయంపై కంపెనీ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. లాంచింగ్ రోజే ధర వివరాలు ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. 

Also Read :  షారుఖ్ ఇంటికి వజ్రాల నేమ్ ప్లేట్.. ఎన్ని లక్షలు ఖర్చు అయిందంటే ? 

 

Visitors Are Also Reading