Home » షారుఖ్ ఇంటికి వజ్రాల నేమ్ ప్లేట్.. ఎన్ని లక్షలు ఖర్చు అయిందంటే ? 

షారుఖ్ ఇంటికి వజ్రాల నేమ్ ప్లేట్.. ఎన్ని లక్షలు ఖర్చు అయిందంటే ? 

by Anji
Ad

స్టార్ సెలబ్రిటీలు చేసే పనులు వాళ్ల స్థాయికి తగ్గట్టే ఉంటుంది. అదే ఒక్కోసారి వివాదానికి కూడా దారి తీస్తుంది. ముఖ్యంగా కాంట్రవర్సిలకు దారి తీసేవిధంగా పనులు చేయడంలో వివాదానికి దారి తీస్తుంది. ప్రధానంగా కాంట్రవర్సీలకు దారి తీసేవిధంగా పనులు చేయడంతో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కి అనుభవం ఎక్కువగా ఉంది. అయితే ఈసారి ఏం చేశాడంటే ? స్టార్స్ ఇంటీరియర్ డిజైన్ కోసం కోట్లు పోస్తుంటారు. టాయిలెట్స్ కూడా బంగారంతో చేయించిన గొప్ప గొప్ప మహానుభావులు చాలా మందే ఉన్నారు. ఆకలితో ఉన్న వారి కోసం మాత్రం గుప్పెడు మెతుకులు ఇచ్చే మంచి మనసులేని వారు ఉన్నారు. ఈ తరుణంలోనే తన ఇంటి నేమ్ ప్లేట్ కోసం లక్షల్లో ఖర్చు చేసి వార్తల్లో నిలిచాడు షారుఖ్.

Advertisement

కోట్లకు కోట్లు ఖర్చు చేసి ఫారినర్స్ ఇంటీరియర్ డిజైనర్ ని పిలిపించి తన హౌజ్ ని డిజైన్ చేయించుకున్నారట. హౌస్ ని ఎంత కష్టపడి డిజైన్ చేయించుకున్నాడనేది లోపలికి వెళ్లిన వారికి మాత్రమే తెలుస్తుంది. బయట కూడా తన దర్పం తెలియాలి అనుకున్నాడో ఏమో.. హౌస్ బయట ఉండే తన ఇంటినేమ్ ప్లేట్ ని అదేవిధంగా స్పెషల్ గా డిజైన్ చేయించాడు. షారుఖ్ ఖాన్   ఇల్లు గురించి చాలా మందికే తెలుసు. మన్నత్ గా పలివడే ఈ ఇంటికోసం పెద్ద పెద్ద వాళ్లు ట్రైచేసినా తనకు ఇష్టమైన ఇంటిని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు షారుఖ్ ఖాన్. ఇక ఈ ఇంటి కోసం స్పెషల్ నేమ్ ప్లేట్ తయారు చేయించాడు కూడా దాని ప్రత్యేకత ఏంటి అంటే.. ఇది మొత్తం వజ్రాలతో క్రియేట్ చేయబడింది. ఇప్పటివరకు ఇండియాలో లక్షల కోట్లు ఉన్నవారు కూడా చేయలేని విధంగా వజ్రాలతో నేమ్ ప్లేట్ క్రియేట్ చేయించుకున్నాడు. ఈ నేమ్ ప్లేట్ కోసం ఆయన ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా.. దాదాపు 70 లక్షలు. ఈ వార్త అప్పట్లో సంచలనంగా మారింది. 

Advertisement

Also Read :   మ‌ళ్లీశ్వ‌రి చైల్డ్ ఆర్టిస్ట్ గ్రీష్మ ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..? ఏం చేస్తుందంటే..?

Manam News

వజ్రాలు నేమ్ ప్లేట్ చూడడానికీ బాలీవుడ్ బాద్ షా  ఇంటికి అభిమానులు ఎగబడుతూనే ఉన్నారు. అంతేకాదు.. ఈ మధ్య ఈ నేమ్ ప్లేట్ లో నుంచి ఒక వజ్రం కిందపడిపోయిందని దాని కోసమే ఈ నేమ్ ప్లేట్ తీసి మళ్లీ ఆ వజ్రాన్ని అటాచ్ చేసి మళ్లీ ఫ్రెష్ గా తన ఇంటికి అతికించారని బాలీవుడ్ లో ఓ న్యూస్ వైరల్ గా మారింది. షారుఖ్ చేసిన ఈ పనికి నెటిజన్లతో పాటు ఆయన అభిమానులు కూడా మండిపడుతున్నారట. డబ్బు ఉంటే పేదవారికి సహాయం చేయాలి. కానీ ఇలా లక్షలు ఖర్చు చేసి నేమ్ ప్లేట్ డిజైన్ చేయించుకుంటే నీకేం వస్తుంది అంటూ షారుఖ్ ని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. 

Also Read :   చిరంజీవిని స్టార్ హీరోని చేసిన సినిమాల లిస్ట్.. ఏంటంటే..?

Visitors Are Also Reading