అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన తెలుగులో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. ఇటీవల పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు అల్లు అర్జున్. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని ఇన్‌స్పిరేషన్ తీసుకొని సినీ ఇండస్ట్రీలోకి వచ్చాడు. ముఖ్యంగా పుష్ప సినిమా బన్నీ క్రేజీని అమాంతం పెంచేసిందనే చెప్పాలి. దేశ విదేశాల్లో అనతి ఫ్యాన్ ఫాలోయింగ్ పుష్ప సినిమాతో రెట్టింపు అయింది. ప్రస్తుం బన్నీ పుష్ప 2 సినిమా చేస్తున్నారు.
Advertisement
ఈ సినిమా కూడా హిట్ అయితే ఆయన రేంజ్ అమాంతం పెరగడం ఖాయం అంటున్నారు. అతని క్రేజ్ గురించి పక్కన బెడితే కొన్ని సందర్భాల్లో అతని ప్రవర్తన చర్చనీయాంశంగా మారుతుంది. బన్ని వ్యవహార శైలీ వల్ల కొందరు అతన్ని తెగ ట్రోల్స్ చేస్తుంటారు. ఇటీవల కృష్ణంరాజు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయనకు సంతాపం తెలియజేస్తూ ఎలాంటి ట్వీట్ చేయకపోవడంతో కొందరూ అతన్ని తెగ ట్రోల్స్ చేశారు. కృష్ణ, చిరంజీవి, మోహన్‌బాబు, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు ట్విట్టర్ వేదికగా సంతాపం ప్రకటించడమే కాదు.. జూబ్లీహిల్స్ లోని కృష్ణంరాజు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని తెలియజేశారు. అల్లు అర్జున్ మాత్రం కృష్ణంరాజు మరణంపై ఎలాంటి ట్వీట్ చేయకుండా తనకు సైమా అవార్డు దక్కడంపై పోస్ట్ చేశాడు. దీంతో తెగ ట్రోల్స్ వచ్చాయి.
Advertisement
ఇది కూడా చదవండి : అల్లు అర్జున్ తన కెరీర్ ప్రారంభంలో ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించాడనే విషయం మీకు తెలుసా..?
రియల్ లైఫ్లో ప్రభాస్, బన్ని మంచి స్నేహితులుగా ఉంటారు. అలాంటిది ఆయన పెదనాన్న చనిపోతే సంతాపం ప్రకటించకుండా తన అవార్డుల గురించి పేర్కొనడమేంటని ఓ వర్గం నెటిజన్లు అల్లుఅర్జున్ పై మండిపడ్డారు. బన్నీపై ఈ విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ ఆయన వాటిని పట్టించుకోలేదు. సైమా వేడుక పూర్తి అయిన వెంటనే హైదరాబాద్ వచ్చిన బన్నీ డైరెక్టర్ గా హైదరాబాద్‌కు చేరుకొని ప్రముఖ నటుడి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కఠిన సమయంలోనూ తన స్నేహితుడు ప్రభాస్ మొహంలో నవ్వు కనిపించే విధంగా చేశాడు అల్లు అర్జున్. ఇక విమర్శించిన నోళ్లన్నీ మూతపడ్డాయి. కొద్ది రోజుల కిందట అనగా సెప్టెంబర్ 02న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఎలాంటి ట్వీట్ చేయకపోవడంతో విమర్శకులు రెచ్చిపోయారు. వాటిపై బన్నీ మాత్రం స్పందించకపోవడం గమనార్హం.
ఇది కూడా చదవండి : ఏఎన్ఆర్ ను ఎంతగానో ఆరాధించే దాసరితో ఎందుకు గొడవలు జరిగాయి….?ఆ గొడవలకు కారణం ఎవరు..?