Telugu News » Blog » ఏఎన్ఆర్ ను ఎంత‌గానో ఆరాధించే దాస‌రితో ఎందుకు గొడ‌వ‌లు జ‌రిగాయి….?ఆ గొడ‌వ‌ల‌కు కార‌ణం ఎవ‌రు..?

ఏఎన్ఆర్ ను ఎంత‌గానో ఆరాధించే దాస‌రితో ఎందుకు గొడ‌వ‌లు జ‌రిగాయి….?ఆ గొడ‌వ‌ల‌కు కార‌ణం ఎవ‌రు..?

by AJAY
Ads

టాలీవుడ్ లోని లెజండ‌రీ ద‌ర్శ‌కుల లిస్ట్ లో దాస‌రి నారాయ‌ణ‌రావు కూడా ఒక‌రు. ఆయ‌న ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించి స్టార్ డైరెక్ట‌ర్ గా ఎదిగారు. హీరోకంటే మందు దాస‌రి పేరు చూసి సినిమాల‌కు వెళ్లేవాళ్లు అంటే ఆయ‌న క్రేజ్ ఏ రేంజ్ లో ఉండేదో అర్థం చేసుకోవ‌చ్చు. దాస‌రి విభిన్న చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేవారు. ఆయ‌న సినిమాల‌లో న‌టించాల‌ని స్టార్ హీరోలు హీరోయిన్ లు కోరుకునేవారు. దాస‌రి ద‌ర్శ‌కుడిగానే కాకుండా న‌టుడిగానూ రాణించిన సంగ‌తి తెలిసిందే.

Ads

ఇవి కూడా చదవండి: అసలు నా కూతురివి కాదంటూ.. అన్షుపై ఎమోషనల్ కామెంట్స్ చేసిన రోజా.. అలా ఎందుకు మాట్లాడిందబ్బా..!!

టాలీవుడ్ లోని చాలా మంది దాస‌రిని త‌మ గురువుగా భావిస్తుంటారు. ముఖ్యంగా మోహ‌న్ బాబు అయితే తాను ఈ స్థాయిలో ఉండ‌టానికి దాస‌రి గారే కార‌ణం అని ఇప్ప‌టికీ ఆయ‌న‌ను త‌లుచుకుంటారు. దాస‌రి చాలా కాలం పాటూ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు పెద్ద‌గా వ్య‌వ‌హ‌రించి కార్తికులు న‌టీన‌టుల స‌మస్య‌ల‌ను కూడా ప‌రిష్క‌రించేవారు. ఇదిలా ఉండ‌గా దాస‌రి ఏఎన్ఆర్ ను ఎంత‌గానో ఆరాధించేవారు.

Ads

అంతే కాకుండా చాలా సార్లు తాను చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో రాణించ‌డానికి కార‌ణం సావిత్రి మ‌రియు ఏఎన్ఆర్ అని చెప్పుకునేవారు. అయితే దాస‌రి ఎంతో ఆరాధించే ఏఎన్ఆర్ తో ఒకానొక సంధ‌ర్బంలో మ‌న‌స్ప‌ర్ద‌లు కూడా వ‌చ్చాయి. రెమ్యున‌రేషన్ విష‌యంలో ఏఎన్ఆర్ మ‌రియు దాస‌రికి విభేదాలు మొద‌లై అవి తారాస్థాయికి చేరుకోవ‌డం అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది. ఈ విష‌యాన్ని దాస‌రి నారాయ‌ణ‌రావు ఓ ఇంట‌ర్వ్యూలో చెబుతూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

త‌మ మ‌ధ్య అలా జ‌రుగుతుంద‌ని ఎప్పుడూ ఊహించ‌లేద‌ని చెప్పారు. ఏఎన్ఆర్ తో స‌మానంగా త‌న‌కు రెమ్యున‌రేష‌న్ ఇస్తున్నందుకు త‌న‌తో ఏఎన్ఆర్ ఒక‌మాట అన్నార‌ని ఆ మాట వ‌ల్లే ఇద్ద‌రి మ‌ధ్య విబేధాలు వ‌చ్చాయ‌ని చెప్పారు. ఇక వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో అప్ప‌ట్లో సూపర్ హిట్ చిత్రాలు వ‌చ్చాయి. ఇండస్ట్రీలో ఇద్ద‌రూ కూడా లెజెండ్స్ గా ఎదిగారు. కానీ ప్ర‌స్తుతం ఇద్ద‌రూ కూడా ఇండ‌స్ట్రీకి దూరం అవ్వ‌డం బాధాక‌రం.

Ad

ఇవి కూడా చదవండి: మీకు కూడా ఇలాంటి దుస్థితి వస్తుంది అంటూ..చిరంజీవి, మోహన్ బాబులపై షాకింగ్ కామెంట్స్ చేసిన వర్మ..!!