ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే… ఒకవేళ టీమిండియా ఓడిపోతే చాలా అవమానకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే తాజాగా ఎసిసి ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో.. పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. పాకిస్తాన్ చేతిలో 128 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది. 353 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా… 224 పరుగులకే చాప చుట్టేసింది.
Advertisement
దీంతో 128 పరుగుల తేడాతో పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలు కావాల్సి వచ్చింది. ఇక పాకిస్తాన్ బౌలర్లలో ముఖిమ్… ఏకంగా మూడు వికెట్లు తీసి టీమిండియా నడ్డి విరిచాడు. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోవడంతో… మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ మ్యాచ్ లో పాక్ ఆటగాళ్లు మరియు ఎంపైర్లు కుమ్మక్కు అయి.. ఫిక్సింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ పాక్ ఆటగాడు.. ఆన్ ఫీల్డ్ ఎంపైర్ తో మాట్లాడుతూ కనిపించడం ఫిక్సింగ్ అనుమానాలకు బలపరుస్తోంది. అలాగే… ఈ మ్యాచ్ యంగ్ ప్లేయర్ల సారాద్యంలో జరుగుతోంది.
Advertisement
అంటే 22 సంవత్సరాలు లోపే ఉన్నవారు ఈ జట్టులో ఉండాలి. కానీ పాకిస్తాన్… ఏ జట్టు పేరు చెప్పి… వయసు మల్లిన ఆటగాళ్లను కూడా బరిలోకి దించిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. లెజెండ్స్ లీగ్ లో ఆడే వయసున్న ఆటగాలను… పిల్లలతో కలిపి బరిలోకి దించిందని పాక బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ తొండాట ఆడి గెలిచిందని నిప్పులు జరుగుతున్నారు. ఇక టీమిండియాలో భారత యువ కెప్టెన్ వయస్సు 20 ఏళ్లు కాగా… మిగిలిన ఆటగాళ్లలో గరిష్ట వయసు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే. కానీ పాకిస్తాన్ జట్టులో 25 సంవత్సరాలు పైబడిన వారు కూడా ఉన్నారట. దీంతో పాకిస్తాన్ పైతీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
7G బృందావన కాలనీ.. హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?
బిచ్చగాళ్ళు మీకు ఎదురు వస్తున్నారా.. అయితే మీరు ఎంతో అదృష్టవంతులు..!
గ్రాండ్ గా SRH కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ పెళ్లి…ఫోటోలు వైరల్