Home » RRR: జక్కన్నా…దీనికి సమాధానమేమిటి?

RRR: జక్కన్నా…దీనికి సమాధానమేమిటి?

by Sravan Sunku

చారిత్రిక వీరులతో ఊరమాస్ స్టెప్పులు వేయించి రాజమౌళి పెద్ద తప్పిదం చేస్తున్నారా…అసలు ఇలాంటి కల్పిత కథలతో సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు రాజమౌళి. చరిత్ర పరిధిలో కల్పన తప్పదు గాని చరిత్రనే కల్పనగా మార్చి ఆ చరిత్ర పురుషులను స్టార్‌ హీరో తరహాలో ప్రచారంలో పెట్టడం సమంజసమేనా? గొప్ప ప్రచారం స్టార్ హీరోల సపోర్ట్ వున్న భారీ సినిమాలు ఎలానూ మంచి ఫలితాలు ఇస్తాయి. కాని ఆ క్రమంలో చరిత్రకు ఏమవుతుంది? అన్న విషయం ఒకసారి ఆలోచించాల్సి ఉంటుంది. మ‌రి దాని గురించి జ‌క్క‌న్న ఎందుకు ఆలోచించ‌డం లేదు. ఏదో సినిమాటిక్‌గా చూపించేద్దాం అనుకుంటే ఎలా? హాలివుడ్‌ లో కూడా ఈ తరహా చిత్రీకరణ ఉంటుంది. . అయితే దానికి కొన్ని ప్రమాణాలు వున్నాయి. మనం వాటిని పాటిస్తున్నామా? అంటే ఓసారి మనమే ఆలోచించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:సింగర్ శ్రీరామ్ పై కుట్ర జరుగుతోందా…ఆ స్క్రీన్ షాట్ లను కావాలనే వైరల్ చేస్తున్నారా…?

naatu naatu song

naatu naatu song

అయితే ఇవ‌న్నీ రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ టీజర్ల విడుదల తర్వాత తలెత్తుతున్న సందేహాలివి. అల్లూరి సీతా రామరాజు, కొమరం భీమ్‌ను కలపడం ఒక కల్పన. వారిద్దరూ ఒక దశలో ఇంటి నుంచి వెళ్లిపోయారనే కామన్‌ పాయింట్‌ తీసుకున్నామన్నారు. స్వతంత్ర పోరాటం ఇందులో వుండదని దర్శకుడు సినిమా చిత్రీకరణ మొదలు పెట్టకముందే చెప్పేశారు. అంటే యోధులుగా వారి ప్రసిద్ధిని ఉపయోగిస్తూనే ఇతర అంశాలపై కేంద్రీకరణ వుంటుందన్న మాట. నాయికగా సీత పాత్రకు చాలా ప్రాధాన్యత వుంటుందని మరో వార్త. ఇద్దరు చారిత్రక వ్యక్తులు ఒకరి గురించి ఒకరు చెప్పడం ఆసక్తికరమే కాని ఆ హీరో అభిమానులను ఆనంద పరిచే తాపత్రయంలో నిజమైన చరిత్ర హీరోలను ఆ ఫ్రేములోకి తీసుకురావలసిందేనా ? ఫ్యాన్స్, స్టార్స్‌ అనగానే ఎవరికి ఎక్కువ… ఎవరికి తక్కువ అని మీడియాలో సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు, వివాదాలు మొదలవుతాయి. చరిత్ర మూలాలతో పని లేకుండా.. ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు కథకూ.. పాత్రకూ మెలికలు. కాని చరిత్ర వీరులను ఫార్ములా ఫ్రేములో కుదించడం అవాంచనీయం కాదా? రామ్‌ చరణ్‌ రంగస్థలం ఎంత వాస్తవికంగా తీశారు? హిట్‌ కాలేదా?

naatu naatu song

naatu naatu song

ఇటువంటి చిత్రాల వలన ఎటువంటి సమస్యలు రావు…చరిత్రను వక్రీకరిస్తేనే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి అని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి దీన్ని ఎంత వ‌ర‌కు మ‌న జ‌క్క‌న్న తీసుకుంటారు. ఇక‌పోతే ఇప్ప‌టి వ‌ర‌కు జ‌క్క‌న్న తీస‌ని సినిమాల్లో ఒక్క‌టి కూడా ఫ్లాప్ అన్న‌దే లేదు. అస‌లు ఫ్లాప్ అనే ప‌దానికి ఆయ‌న డిక్ష‌న‌రీలో చోటే లేదు. మ‌రొ ఇప్ప‌టి వ‌ర‌కు తీసిన చిత్రాలు ఒక ఎత్తు అయితే ప్ర‌స్తుతం ఆయ‌న తెర‌కెక్కించ‌బోయే ఆర్‌.ఆర్‌.ఆర్ చిత్రం ఒక ఎత్తు. ఇది ఇద్ద‌రు చారిత్ర‌క వీరుల చ‌రిత్ర‌ను ఆధారంగా తీసుకుని క‌థ‌ను తెర‌కెక్కిస్తున్నారు. అలాంట‌ప్పుడు ఎక్క‌డా కూడా త‌ప్పిదాలు అనేవి జ‌ర‌గ‌కూడ‌దు.

ఇవి కూడా చదవండి: అల్లు అర్జున్ కు లీగ‌ల్ నోటీసులు! సెలెబ్రిటీలు అయ్యిండి ఇలా చేయొద్దంటూ సూచించిన స‌జ్జ‌నార్!

You may also like