ఎంతపెద్ద డైరెక్టర్ అయినా సినిమాల్లో లాజిక్ లు మిస్ అవ్వడం కామన్. వాళ్లకు తెలియకుండానే కొన్ని సీన్లలో మిస్టేక్ లు జరిగిపోతాయి. అయితే ఇదివరకూ దర్శకులు బోలెడు మిస్టేక్స్ చేసేవాళ్లు కానీ వాటిని ఎవరూ పట్టించుకునేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వాడకం పెరిగిపోయింది. ఒక్కో సినిమాను ఓటిటిలో ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూస్తున్నారు. ఇలా చూసేటప్పుడు దర్శకుడు ఏ చిన్న లాజిక్ మిస్సైనా కూడా వెతికి మరీ ట్రోల్ చేస్తున్నారు.
తాజాగా విడుదలైన సినిమాలకే కాదు ఎప్పుడో విడుదలైన సినిమాలకు కూడా ఈ తిప్పలు తప్పడం లేదు. రీసెంట్ గా విడుదలైన సర్కారువారిపాట సినిమాలో కీర్తి సురేష్ మహేశ్ బాబు వద్ద 25వేల డాలర్లు అప్పు చేస్తుంది. కానీ మహేశ్ బాబు పదివేల డాలర్లు అప్పు ఇచ్చానని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. ఇక్కడ దర్శకుడు లాజిక్ మిస్ అవ్వడంతో నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి. దాంతో డైరెక్టర్ రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చాడు.
Advertisement
Advertisement
ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమా ఫిదా. ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య వచ్చి ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఎన్నారై పాత్రలో నటించగా సాయిపల్లవి పక్కా తెలంగాణ పిల్లలా తెలంగాణ యాసతో అదరగొట్టింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ తన అన్నతో పాటూ అమెరికాలో ఉంటాడు. సాయిపల్లవి అక్క వరుణ్ తేజ్ సోదరుడిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోతుంది.
కాగా ఓ సీన్ లో సాయి పల్లవి తన అక్కతో ఫోన్ మాట్లాడుతుంది. ఇక్కడి వరకూ అంతా భాగానే ఉంది కానీ అమెరికాలో డే అయితే ఇండియాలో చీకటి అవుతుంది. కానీ సినిమాలో మాత్రం రెండు సీన్లలోనూ డే గానే కనిపనిస్తుంది. ఈ మిస్టేక్ ను ట్రోలర్స్ పట్టేయడంతో నెట్టింట దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు శేకర్ శేఖర్ సార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ALSO READ :
ఆర్జీవీ చిరుల కాంబినేషన్ లో ప్రారంభించిన సినిమా మధ్యలోనే ఆగిపోవడానికి కారణం ఎవరో తెలుసా..?
“కళావతి” పాటకు పియానో వాయించిన అకీరా నందన్…వీడియో వైరల్…!