Home » ఆర్జీవీ చిరుల‌ కాంబినేష‌న్ లో ప్రారంభించిన సినిమా మ‌ధ్య‌లోనే ఆగిపోవ‌డానికి కార‌ణం ఎవ‌రో తెలుసా..?

ఆర్జీవీ చిరుల‌ కాంబినేష‌న్ లో ప్రారంభించిన సినిమా మ‌ధ్య‌లోనే ఆగిపోవ‌డానికి కార‌ణం ఎవ‌రో తెలుసా..?

by AJAY
Ad

సంచ‌ల‌నాల ద‌ర్శ‌కుడు ఆర్జీవీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆర్జీవీ అంటే ఒక బ్రాండ్…ఆయ‌న త‌న‌కు న‌చ్చిందే చేస్తూ న‌చ్చిన‌ట్టు బ్ర‌తుకుతారు. ఇక కొంత‌కాలంగా మాత్రం ఆర్జీవీ సినిమాలు వ‌రుస ఫ్లాపులే…అయితేనేం ఆయ‌న క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌దు. త‌న సినిమాలు ఫ్లాప్ అవ్వ‌డానికి కార‌ణం తాన‌కు న‌చ్చిన‌ట్టు సినిమా తీయ‌డ‌మే అని న‌చ్చిన‌వాళ్లు చూడొచ్చ‌ని లేదంటే లేద‌ని కూడా ఆర్జీవి మొహ‌మాటం లేకుండా చెబుతాడు.

Advertisement

కానీ ఒక‌ప్ప‌టి ఆర్జీవి వేరు…ఆయ‌న‌తో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు ఎదురుచూసేవారు. నాగార్జున తో శివ సినిమా తీసి ఆర్జీవీ ట్రెండ్ ను సెట్ చేశారు. అంతే కాకుండా స‌ర్కార్ లాంటి సినిమా చేసి బాలీవుడ్ లోనూ స‌త్తా చాటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్జీవీ కెరీర్ లో డిజాస్ట‌ర్ ల‌తో పాటూ బ్లాక్ బ‌స్ట‌ర్ లు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా రామ్ గోపాల్ వ‌ర్మ శివ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్న త‌ర‌వాత వెంక‌టేశ్, చిరంజీవి ల‌తో సినిమాలు చేయాల‌ని నిర్నయించుకున్నాడు.

Advertisement

ఈ సినిమా చేసేందుకు వైజ‌యంతీ మూవీస్ ముందుకు వ‌చ్చింది. వ‌ర్మ స్క్రిప్ట్ సిద్దం చేసి చిరంజీవికి వినిపించాడు. క‌థ విన్నత‌ర‌వాత చిరంజీవి క‌థ‌లో కొన్ని మార్పుల‌ను సూచించారు. కానీ రామ్ గోపాల్ వ‌ర్మ అందుకు నిరాక‌రించాడు. అంతే కాకుండా స్క్రిప్ట్ విష‌యంలో వేళ్లు పెడితే తాను సినిమా నుండి తప్పుకుంటాన‌ని వ‌ర్మ చెప్పేశాడు.

అయితే అప్ప‌టికే ఈ సినిమా కోసం రెండు పాట‌ల‌ను కూడా రూపొందించారు. కానీ చివ‌రికి ఆర్జీవి ముందుగానే చెప్పిన‌ట్టుగా సినిమా నుండి త‌ప్పుకున్నాడు. దాంతో అప్ప‌టికే రూపొందించిన రెండు పాట‌ల‌ను చూడాల‌ని ఉంది సినిమాలో వాడుకున్నారు. అలా ఆర్జీవీ చిరుల కాంబినేష‌న్ లో రావాల్సిన సినిమా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది.

ALSO READ :

అఖిల్ న‌టించిన 4 సినిమాలు ఫ్లాప్..! అందుకు కార‌ణాలు ఇవేనా..?

Visitors Are Also Reading