Home » “కళావతి” పాటకు పియానో వాయించిన అకీరా నందన్…వీడియో వైరల్…!

“కళావతి” పాటకు పియానో వాయించిన అకీరా నందన్…వీడియో వైరల్…!

by AJAY
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముద్దుల కుమారుడు అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అకీరా కటౌట్ చూసి ఎంట్రీ ఇస్తే వెంటనే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని అభిమానులు అంటున్నారు. కానీ ఇటీవల రేణు దేశాయ్ మాత్రం అకీరా సినిమాల్లోకి రాడని అతడికి సినిమాల పై ఆసక్తి లేదని చెప్పింది. అంతే కాకుండా అకీరా ఎంట్రీ పై వస్తున్న వార్తలను ఖండించింది.

Advertisement

దాంతో ఫ్యాన్స్ ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఇదిలా ఉండగా కొద్దిరోజుల క్రితం పవన్ కళ్యాణ్ తోపాటు అకీరా నందన్ కూడా సంగీతం నేర్చుకుంటున్నారు అని ఓ ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది. ఇదిలా ఉంటే ఇప్పుడు అకీరా నందన్ మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా లోని కళావతి పాట కు అదిరిపోయే పియానో మ్యూజిక్ వాయించారు.

Advertisement

దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మహేష్ బాబు పాటకు పవన్ కళ్యాణ్ తనయుడు అందించిన పియానో మ్యూజిక్ అదిరిపోయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అకిరా నందన్ టాలెంట్ చూసి పవన్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

ఇక సర్కారు పాట సినిమాలోని కళావతి పాట సినిమా విడుదల కు ముందే పెద్ద హిట్ అయ్యింది. ఈ పాటకు ఎంతోమంది ఫిదా అయ్యారు. ఇప్పుడు అకిరా ఇదే పాటకు పియానో వాయించడం తో పాట క్రేజ్ మరింత పెరిగింది. అయితే అకీరా టాలెంట్ చూస్తే హీరోగా ఎంట్రీ ఇవ్వకపోయినా మ్యూజిక్ డైరక్టర్ గా అయినా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.

Visitors Are Also Reading