Home » పుష్ప రాజ్ తో గోల్డెన్ బాయ్‌..!

పుష్ప రాజ్ తో గోల్డెన్ బాయ్‌..!

by Azhar
Ad
అల్లు అర్జున్ హీరోగా గత ఏడాది చివర్లో విడుదల అయినా పుష్ప సినిమా ఏ రేంజ్ లో హంగామా చేసిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలోనే పాటలు.. అల్లు అర్జున్ మ్యానరిజాం కూడా సౌత్ తో పటుహా నార్త్ ఫ్యాన్స్ ను కూడా కట్టేసింది. అయితే ఈ సినిమా కేవలం ఇండియా వరకే పరిమితం కాకుండా.. విదేశాల్లో కూడా తన మార్క్ ను చూపించింది.
అయితే తాజాగా ఢిల్లీలో నిర్వహించిన ‘ఇండియన్ ఆఫ్ ది ఈయర్’ ఈవెంట్ లో.. ఈ సూపర్ హిట్ సినిమాకు గాను.. అల్లు అర్జున్ కు ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరీలో ‘ఇండియన్ ఆఫ్ ది ఈయర్ అవార్డు అనేది వరించింది. దాంతో ఈ ఈవెంట్ కు వెళ్లిన ఆలు అర్జున్.. ఇండియా గోల్డెన్ బాయ్‌ గా గుర్తింపు పొందిన.. నీరజ్ చోప్రాను కలిసాడు.
ఇక అక్కడ ఆలు అర్జున్ తో మాట్లాడిన నీరజ్ చోప్రా.. పుష్ప సినిమాలోని తగ్గేదేలే స్టైల్ ను చేసాడు. ఇక ఆలు అర్జున్ కూడా.. నీరజ్ చోప్రా యొక్క జావెలిన్ త్రో స్టైల్ ను చేస్తూ.. ఫోటోల్లకు పోజులు ఇచ్చారు. అయితే బన్నీకి సినిమా విషయంలో వచ్చిన ఇండియన్ ఆఫ్ ది ఈయర్ అవార్డు అనేది నీరజ్ చోప్రాకు క్రీడల్లో వచ్చింది. ఇక దేశ వ్యాప్తంగా ఇంత సూపర్ హిట్ అయిన పుష్ప సీక్వెల్ అనేది అల్లు అర్జున్ తొందరలోనే ప్రారంభించనున్నాడు అనేది తెలిసిందే.

Advertisement

Visitors Are Also Reading