Home » కోహ్లీ – రోహిత్ కెప్టెన్సీలో తేడాలు ఇవే..!

కోహ్లీ – రోహిత్ కెప్టెన్సీలో తేడాలు ఇవే..!

by Azhar
Ad
భారత జట్టుకు ధోని తర్వాత కెప్టెన్ గా విరాట్ కోహ్లీ మంచి పేరు అనేది తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం కెప్టెన్ గ ఉన్న రోహిత్ శర్మకూడా కెప్టెన్ గా మంచి ఘనతలు ఉన్నాయి. అయితే వీరి కెప్టెన్సీలో ఉన్న తేడాలు ఏంటి అనేవి.. ఇద్దరి కెప్టెన్సీలో ఐపీఎల్ లో ఆడిన న్యూజిలాండ్ మాజీ ఆటగాడు కోరీ అండర్సన్ తెలిపాడు. వీరి కెప్టెన్సీ పద్దతి పూర్తి విభిన్నం అని అండర్సన్ తెలిపాడు.
కోహ్లీ ఫీల్డ్ లోనే ఎక్కువ నిర్ణయాలు తీసుకుంటాడు. అలాగే తన ఆటగాళ్లను పూర్తిగా నమ్ముతాడు. కానీ రోహిత్ బయట మీటింగ్స్ అనేవి ఎక్కువ జరుపుతాడు. ఇక గ్రౌండ్ లో అతను స్లో ఉన్న.. అతని మైండ్ ఫాస్ట్ గా ఉంటుంది. ఇక వీరిద్దరూ కూడా బౌలర్లను బాగా నమ్ముతారు. వారు ఎన్ని పరుగులు ఇచ్చిన.. ఆ నమ్మకం అనేది కోల్పోరు.
అయితే కోహ్లీలో కొంచెం తొందర ఎక్కువ.. అతను బయట చేసిన ప్లాన్ ఏదైనా పని చేయకపోతే వెంటనే.. దానిని మార్చేసి కొత్త ప్లాన్ తో ముందుకు వెళ్తాడు. కానీ రోహిత్ అలా కాదు. ప్లాన్ అనేది పని చేయకపోతే.. అది పని చేసేవరకు దాని పైనే ఉంటాడు. కానీ అనుకున్నది చేయడానికి ఇద్దరిలో పట్టుదల అనేది మాత్రం ఎప్పుడు హై లో ఉంటుంది అని కోరీ అండర్సన్ పేర్కొన్నాడు. ఈ కామెంట్స్ తో ఇద్దరి ఫ్యాన్స్ కూడా హ్యాపీ అని తెలుస్తుంది.

Advertisement

Visitors Are Also Reading