Home » బేబీ మూవీపై నయనతార భర్త ఏమన్నారో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

బేబీ మూవీపై నయనతార భర్త ఏమన్నారో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం బేబి మూవీ బీభత్సం సృష్టిస్తోంది. చిన్న సినిమాగా ఆడియన్స్ ముందుకొచ్చి భారీగా కలెక్షన్లు కొల్లగొడుతుంది. యంగ్ అండ్ టాలెంటేడ్ హీరో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ప్రధానంగా యూత్ ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాలో వీరి ముగ్గురి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.  

Advertisement

బేబి మూవీ సక్సెస్ మీట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అలాగే లెక్కల మాస్టర్, డైరెక్టర్ సుకుమార్, అల్లు అరవింద్ వంటి స్టార్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా బేబి చిత్రంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త విఘ్నేష్ శివన్. తన ఇన్ స్టా స్టోరీలో బేబి చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. “ఒక కొత్త బోల్డ్ టీమ్ నుంచి వచ్చిన కొత్తతరం సినిమా క్రేజీ రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఈ గ్రాండ్ సక్సెస్ కి దోస్. చాలా బోల్డ్ గా రాసారు. బ్రూటల్ గా చిత్రీకరించారు అంటూ డైరెక్టర్ సాయి రాజేష్, హీరో ఆనంద్ దేవరకొండ ను ట్యాగ్ చేశారు.

Advertisement

ప్రస్తుతం విఘ్నేష్ శివన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దర్శకుడు సాయి రాజేష్ విఘ్నేష్ పై స్పందించారు. విఘ్నేష్ సర్.. మా సినిమా మీకు నచ్చడం చాలా సంతోషంగా ఉంది. నానుమ్ రౌడి ధాన్ సినిమాకి నేను వీరాభిమానిని. త్వరలో మిమ్మల్ని కలుస్తాను. కృతజ్ఞతలు అంటూ రిప్లై ఇచ్చారు. అదేవిధంగా హీరో ఆనంద్ దేవరకొండ రియాక్ట్ అవుతూ.. థాంక్యూ సోమచ్ సర్.. మీకు సినిమా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ మూవీపై విఘ్నేష్ స్పందించడంతో త్వరలోనే ఈ మూవీ తమిళంలో రీమేక్ చేయబోతున్నారా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.71.6 కోట్ల గ్రాస్ వసూలు చేసింది బేబి మూవీ. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది బేబి టీమ్. 

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

హీరోయిన్ పై కామెంట్స్ చేసిన హీరో రాజశేఖర్… కట్ చేస్తే సినిమా నుంచి ఔట్…!

Bro: “బ్రో” ఈవెంట్ లో పవన్ అలా మాట్లాడడానికి కారణం అయిన ఆ రూల్స్ ఏంటి?

Visitors Are Also Reading