Home » Nayanthara Remuneration : 20 కోట్లు వసులు చేస్తున్న నయనతార !

Nayanthara Remuneration : 20 కోట్లు వసులు చేస్తున్న నయనతార !

by Bunty
Ad

 

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు పది సంవత్సరాలకు పైనే పూర్తి కావస్తోంది. తన అద్భుతమైన నటన, అందంతో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ సినిమాలలో కూడా తన హవాను కొనసాగిస్తోంది. ఈ అమ్మడు ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. నయనతార ఎప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూ ఇండస్ట్రీలో తన సత్తా ఏంటో చూపిస్తోంది.

Advertisement

అయితే నయనతార సినిమాలలో నటించినందుకు భారీగానే రెమ్యూనరేషన్ వసూలు చేస్తుందట. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా నయనతార మొదటి స్థానంలో నిలుస్తుండడం గమనార్హం. దాదాపు ఒక్కో సినిమాలో నటించినందుకు గాను 10 నుంచి 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. అంతేకాకుండా నయనతార పలు యాడ్ లలో కూడా నటిస్తోంది. కేవలం 50 సెకండ్ల యాడ్ కోసం 5 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందట.

Cruel trolling on Nayanthara

Cruel trolling on Nayanthara

యాడ్ సమయం పెరిగిన కొద్దీ రెమ్యూనరేషన్ కూడా పెంచుతుందట ఈ అమ్మడు. అలా ఒక్కో యాడ్ కోసం సుమారు 5 నుంచి 8 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం. నయనతారకు సౌత్, నార్త్ లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఈమెతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు సైతం పోటీ పడుతున్నారట. ఎలాంటి అగ్ర హీరోల సరసన అయినా నయనతార చాలా సులువుగా నటించేస్తుంది. ప్రస్తుతం నయనతార చేతినిండా అరడజను సినిమాలు, అంతేకాకుండా పలు యాడ్ లు కూడా ఉన్నాయట. నయనతార భారీగానే ఆస్తులను కూడా సంపాదించినట్లు సమాచారం అందుతుంది. లగ్జరీ భవనాలు, కార్లు, స్థలాలు చాలా ఉన్నాయని ఇండస్ట్రీవర్గాల్లో టాక్ నడుస్తోంది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading