లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి వరకు బాగానే ఉన్నా ఇటీవల తాము కవలలకు జన్మనిచ్చామని నయన్ దంపతులు సోషల్ మీడియా వేదికగా చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెళ్లయి నాలుగు నెలలు కూడా కాలేదు అప్పుడే ఇలా నయనతార కవలలకు జన్మనిచ్చిందంటూ వార్తలు వినిపించాయి. తాము సరోగసీ ద్వారా పిల్లలను కన్నా మని నయన్, విఘ్నేష్ వెల్లడించారు. దీంతో సరోగసీ అనేది ఇండియాలో చట్టబద్ధం కాదని, కొన్ని అనివార్య కారణాలు తప్పితే మిగతా సమయాల్లో సరోగసీ ని వాడొద్దని భారత చట్టాలు పేర్కొంటున్నాయి.
దీంతో నయన్ దంపతులు అడ్డం గా బుక్ అయ్యిపోయిపోయారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం ఆరోగ్య శాఖ మంత్రికి ఈ ఘటనకు సంబంధించి విచారణ చేయాలని ఆదేశించింది. దీంతో ఆరోగ్య మంత్రి సుబ్రహ్మణ్యం కమిటీ వేశారు. ఆ కమిటీ నయనతార సరోగసీ విషయంపై దర్యాప్తు చేస్తోంది. దీంతో సరోగసీ ప్రక్రియను నిర్వహించిన ఆసుపత్రిని కమిటీ గుర్తించింది. వెంటనే అధికారులు ఆసుపత్రికి వెళ్ళి వివరాలు సేకరిస్తున్నారు. త్వరలోనే కమిటీ నయన్ దంపతులను కూడా పిలిచి విచారించనున్నారు. చెన్నైలోని ఓ ఆస్పత్రికి అది. ఈ ఆస్పత్రిలోనే నయన్, విగ్నేష్ దంపతులు సరోగసీ ద్వారా ఇద్దరు మగ కవలలకు జన్మనిచ్చినట్టు తెలుస్తోంది.
Advertisement
Advertisement
Also Read : 1999 బాలకృష్ణ, చిరంజీవి సునామి లో కొట్టుకుపోయిన టాలీవుడ్ సినిమాలు ఇవే!
సరోగసీకి ఒప్పుకున్న మహిళ కూడా ఎవరో కాదు.. నయనతార కాలేజీ ఫ్రెండ్ అని తెలుస్తోంది. ఆమె ఫ్రెండ్ మాత్రమే కాదు బంధువు కూడా అని అంటున్నారు. ఆమె దుబాయ్ లో ఉంటుందని, బిజినెస్ చేస్తోందని తెలుస్తోంది. తమకు ఆరేళ్ళ క్రితం వివాహం అయిందని, నయన్ కు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పే ఒక అఫిడవిట్ ను నయన్.. తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించింది. సరోగసీ నిబంధనల ప్రకారం పెళ్లి అయ్యి 5 ఏళ్ళు అయినా పిల్లలు కలగకపోవడంతో సరోగసీ ప్రక్రియ ద్వారా పిల్లలను కన్నామని అందులో నయన్ స్పష్టం చేసింది.
Also Read : ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్లు చిరంజీవి కోసం అంతలా కొట్టుకున్నారా.. సీక్రెట్ బయటపెట్టిన చిరు..!!