Home » న‌య‌న్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్…త్వ‌ర‌లోనే సినిమాల‌కు గుడ్ బై..?

న‌య‌న్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్…త్వ‌ర‌లోనే సినిమాల‌కు గుడ్ బై..?

by AJAY
Ad

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార అంటే ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. న‌య‌న్ తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్టార్ హీరోయిన్ గా రానిస్తోంది. అంతే కాకుండా ప్ర‌స్తుతం హీరోయిన్ గా న‌టిస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ అద‌ర‌గొడుతోంది. గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు ప‌రిమితం అవ్వ‌కుండా న‌య‌న్ ఛాలెంజిగ్ పాత్ర‌ల‌ను ఎంచుకుంటోంది. ఈ నేప‌థ్యంలోనే న‌య‌న్ రెమ్యున‌రేష‌న్ కూడా భారీగా అందుకుంటోంది.

Advertisement

ఇక రీసెంట్ గా న‌య‌న్ త‌న ప్రియుడు త‌మిళ ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌ణ్ ను పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కాగా వీరికి ఇద్ద‌రు క‌వ‌ల‌లు కూడా జ‌న్మించారు. పెళ్లైన నాలుగు నెల‌ల‌కే ఈ దంప‌తులు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నివ్వడంతో వీరి వ్య‌వ‌హారం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా ఈ జంట లీగ‌ల్ కూడా ఇబ్బందులు ఎదురుకుంది. అయితే ఆ త‌ర‌వాత ఏం జ‌రిందో కానీ న‌య‌న్ దంప‌తులు సేఫ్ అయ్యారు.

Advertisement

ఇక తెలుగులో చివ‌ర‌గా న‌య‌న్ చిరంజీవి హీరోగా న‌టించిన గాఢ్ ఫాద‌ర్ సినిమాలో న‌టించి మెప్పింది. కానీ త‌మిళంలో ఈ అమ్మ‌డు ఫుల్ బిజీగా ఉంది.ఇదిలా ఉంటే ఇప్ప‌డు న‌య‌న్ గురించి కొన్ని వార్త‌లు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో షారుక్ ఖాన్ కు జోడీగా జ‌వాన్ సినిమాలో న‌టిస్తోంది. అయితే ఈ సినిమా త‌ర‌వాత న‌య‌న్ సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌బోతుందంటూ టాక్ జోరుగా వినిపిస్తోంది. పిల్ల‌ల ఆల‌నా పాల‌న కోస‌మే న‌య‌న్ ఈ సంచ‌ల‌న నిర్న‌యం తీసుకున్న‌ట్టు టాక్. అయితే ఈ వార్త‌ల‌పై న‌య‌న్ స్పందిస్తేనే గానీ క్లారిటీ రాదు.

ALSO READ :Taraka Ratna Restaurant: తారకరత్న హోటల్‌ను కూల్చివేశారా? అసలు ఏం జరిగింది?

Visitors Are Also Reading