Home » న‌య‌న్ కు దెబ్బ మీద దెబ్బ‌…అమ్మ‌డి కెరీర్ మొత్తం రిస్క్ లో ప‌డిపోయిందా..?

న‌య‌న్ కు దెబ్బ మీద దెబ్బ‌…అమ్మ‌డి కెరీర్ మొత్తం రిస్క్ లో ప‌డిపోయిందా..?

by AJAY
Ad

ఎంతటి హీరోయిన్ అయినా ఫ్లాప్ లు త‌ప్ప‌వు. అయితే వ‌రుస ఫ్లాప్ లు ప‌డుతుంటే మాత్రం కెరీర్ పై ఎఫెక్ట్ ప‌డిన‌ట్టే. అయితే ఇప్పుడు సౌత్ ఇండియ‌న్ స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార కూడా అలాంటి ఇబ్బందుల‌నే ఎదురుకుంటుంది. న‌య‌న‌తార ప్ర‌స్తుతం త‌మిళ‌, తెలుగు చిత్రాల‌లో న‌టిస్తూ ఫుల్ బిజీగా ఉంది. సీనియ‌ర్ హీరోల‌కు జోడీగా సినిమా ఆఫ‌ర్ లు అందుకుంటోంది.

Advertisement

ఇక న‌యన్ ఓ వైపు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌లో సీనియ‌ర్ హీరోల‌కు జోడీగా న‌టిస్తూనే మ‌రోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌తో త‌న మార్క్ ను వేసుకోవాల‌ని అనుకుంటోంది. నిజానికి ప్ర‌స్తుతం ఫుట్ క్రేజ్ ఉన్న హీరోయిన్ ల‌లో న‌య‌న‌తార కూడా ఒక‌రు. అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ ను ఈ బ్యూటీ తీసుకుంటుంది.

Advertisement

అంతే కాకుండా సొంతంగా ప్రైవేట్ జెట్ క‌లిగిన ఒకే ఒక్క సౌత్ హీరోయిన్ న‌య‌న్…అయితే ఇప్పుడు న‌య‌న్ కెరీర్ ప్ర‌మాదంలో ప‌డిపోయింది. అయితే అది సినీ కెరీర్ మాత్ర‌మే. న‌య‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న వ‌రుస సినిమాలు ఫ్లాప్ లు అవుతున్నాయి. న‌య‌న్ సినిమాల‌కు నిజానికి చాలా హైప్ ఉంది. కానీ సినిమాలు మాత్రం ఆరేంజ్ లో ఉండ‌క‌పోవ‌డంతో బాక్స్ ఆఫీస్ వ‌ద్ద డ‌మాల్ అంటున్నాయి. గ‌తేడాది న‌య‌న‌తార నేత్రిక‌న్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.

Nayanatara Vignesh shivan

Nayanatara Vignesh shivan

ఆ త‌ర‌వాత త‌న భ‌ర్త ద‌ర్శ‌క‌త్వంలో కాతువాక్కుల రెండు కాదల్ అనే సినిమాతో వ‌చ్చింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. తెలుగు రీసెంట్ గా వ‌చ్చిన గాడ్ ఫాదర్ సినిమాలో న‌టించగా ఆ సినిమాతో కూడా న‌య‌న్ కు ఒరిగింది ఏమీ లేదు. ఇక ఇటీవ‌ల న‌య‌న‌తార క‌నెక్ట్ అనే థ్రిల్ల‌ర్ సినిమాతో ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా కూడా డ‌మాల్ అయ్యింది. దాంతో న‌య‌న్ కెరీర్ రిస్క్ లో ప‌డిపోయింది. మ‌రి ఫ్యూచ‌ర్ లో ఈ అమ్మాడి కెరీర్ లో హిట్ కొడ‌తుందా మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌స్తుందా చూడాలి.

Visitors Are Also Reading