ఏపీ టెన్త్ రిజల్ట్ వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏలూరు కి చెందిన విద్యార్థిని మనస్వి కి అద్భుతంగా మార్కులు వచ్చాయి. 600 కి 599 మార్కులు సాధించింది మనస్వి. సోషల్ మీడియా వేదికగా ఈ విషయం వైరల్ అయిన విషయం మనకి తెలిసిందే. ఇప్పటిదాకా మార్కుల విషయంలో మనస్వి మార్కులే స్టేట్ హైయెస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పట్లో ఈ రికార్డు బ్రేక్ అయ్యే అవకాశం కూడా లేనట్లు తెలుస్తోంది. అలానే నవీన కూడా బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంది. ఆమె సక్సెస్ స్టోరీ చూశారంటే కచ్చితంగా మెచ్చుకుంటారు.
Advertisement
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని చిప్పగిరి మండలం బంటనహాల్ కి చెందిన నవీన అనే విద్యార్థిని వారంలో మూడు రోజులు కూలీ పని కి వెళ్ళేది. ఆమె 509 మార్కులు సాధించింది చిప్పగిరి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల మార్కులు పరిశీలించినట్లయితే నవీన సాధించిన మార్పులు ఎక్కువ అని తెలుస్తోంది. కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో వారంలో మూడు రోజులు పనికి వెళ్లాల్సి వచ్చింది అని నవీన చెప్తోంది. నవీన తల్లి కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. తండ్రి కూలి పని చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు.
Advertisement
Also read:
Also read:
నవీన కూలి పనికి వెళ్లకుండా ఉండి ఉంటే ఇంకా ఎక్కువ మార్కులు వచ్చేవని అంత అంటున్నారు. భవిష్యత్తులో ఎవరైనా ఆర్థిక సహాయం అందిస్తే ఇబ్బంది కూడా రాకుండా ఆమె చదువుకుంటుందని అంటున్నారు. పొలిటిషన్లు సపోర్ట్ ఇటువంటి విద్యార్థులకు ఉంటే బాగుంటుందని ఇంకొంతమంది వాళ్ళ అభిప్రాయం చెబుతున్నారు. టెన్త్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన నవీనని నెటిజన్లు అభినందిస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ స్థాయిలో మార్కుల రావడం అంత ఈజీ కాదని మెచ్చుకుంటున్నారు. నవీన వంటి మట్టిలో మాణిక్యాలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి సహాయ సహకారాలు అందే విధంగా చూడాలని అప్పుడు వాళ్లు మరింత బాగా చదువుకుని జీవితంలో పైకి వెళ్తారని అంటున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!