Home » కేవలం దానికోసమే కోట్లు ఖర్చు పెడుతున్న పవిత్ర లోకేష్..!!

కేవలం దానికోసమే కోట్లు ఖర్చు పెడుతున్న పవిత్ర లోకేష్..!!

by Sravanthi
Ad

తెలుగు ఇండస్ట్రీలో గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవిత్ర లోకేష్ పేరు వినిపిస్తోంది. ఆమె సినిమాల్లో కూడా నటించి ఇంత పేరు తెచ్చుకుందో లేదో కానీ, సోషల్ మీడియా ద్వారా మాత్రం చాలా పేరు సంపాదించుకుంది. పవిత్ర లోకేష్ మరియు నరేష్ మధ్య ఏదో యవ్వారం నడుస్తుందని ఇప్పటికీ వార్తలు వస్తూనే ఉన్నాయి.. మరి అలాంటి పవిత్ర లోకేష్ అందం కోసం ఖర్చు పెట్టడంలో ఎప్పుడు కాంప్రమైజ్ కాదట.. తన అందానికి పడిపోయిన నటుడు నరేష్ తనతో సహజీవనం చేస్తున్నాడని వార్తలు ఎప్పటినుంచో వస్తున్నాయి.

Advertisement

also read:బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ తో మెగాస్టార్ డిన్నర్..!

Advertisement

ఇప్పటికే ఇద్దరు కలిసి గుళ్ళు, గోపురాలు, టూర్లు వెళ్తూ ఉంటారు. ఈ సందర్భంగానే వారు వివాహం చేసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. వీటన్నిటికీ నరేష్ స్పష్టత ఇచ్చారు. మేం వివాహం చేసుకోలేదు. కలిసి జీవిస్తున్నామని స్పష్టంగా చెప్పారు. కానీ నరేష్ కి దగ్గరయ్యాక పవిత్ర లైఫ్ మారిపోయిందని, ఆమె సకల సౌకర్యాలు అనుభవిస్తోందని సమాచారం. నరేష్ కు ఉన్నటువంటి ఆస్తి అనుభవించే ఛాన్స్ కేవలం పవిత్ర లోకేష్ కు మాత్రమే దక్కిందని చెప్పవచ్చు. ఆమె అడిగితే ఏమైనా ఇచ్చే నరేష్ అండతో పవిత్ర లోకేష్ భారీగానే ఖర్చు చేస్తోందట.

ముఖ్యంగా తన అందం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ, యంగ్ గా కనిపించాలని ఆలోచనతో ఉంటున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 43 ఏళ్ల పవిత్ర లోకేష్ బరువు తగ్గి మరింత యంగ్ గా కనిపించి, నరేష్ ను ఆకట్టుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. తన అందం కోసం విపరీతమైన డబ్బు ఖర్చు చేస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

also read:

Visitors Are Also Reading