Home » స్పీడుమీదున్న న‌రేష్..మొన్న‌క్యారెవ్యాన్..నేడు స్పోర్ట్స్ కారు..!

స్పీడుమీదున్న న‌రేష్..మొన్న‌క్యారెవ్యాన్..నేడు స్పోర్ట్స్ కారు..!

by AJAY
Ad

పండంటి కాపురం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో నరేష్. హీరోగా నరేష్ ఎన్నో సినిమాల్లో చేసి ఆకట్టుకున్నారు. ఇక‌ జంబలకడి పంబ సినిమా తో టాలీవుడ్ ప్రేక్షకులకు నరేష్ మరింత దగ్గరయ్యారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నరేష్ తన నటనతో ప్రేక్షకులను అలరించారు. ఇక ప్రస్తుతం నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నరేష్ తన నటనతో ఆకట్టుకుంటున్నారు.

naresh caravan

Advertisement

రీసెంట్ గా రంగస్థలం సినిమాలో నరేష్ నటనకు ప్రశంసలు అందాయి. రామ్ చ‌ర‌ణ్ తండ్రిగా ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల్లో న‌టించి మెప్పించారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే నరేష్ మా ఎలక్షన్లలో చాలా చురుకుగా వ్యవహరించారు. మంచు విష్ణు ప్యానల్ కు సపోర్ట్ చేసి ప్రకాష్ రాజ్ ప్యాన‌ల్ పై విమర్శలు కురిపిస్తూ వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచారు. ఇదిలా ఉంటే నరేష్ ఇటీవల ఒక క్యారెవ్యాన్ ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. లగ్జరీ క్యారెవాన్ క‌లిగిన‌ టాలీవుడ్ లోనే మొదటి నటుడుగా నరేష్ గుర్తింపు తెచ్చుకున్నారు.

Advertisement

naresh new car

ఇదిలా ఉండగానే ఇప్పుడు న‌రేష్ ఖ‌రీదైన‌ స్పోర్ట్స్ కారును కొనుగోలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నరేష్ వెల్లడించారు. నా కల నెరవేరింది ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అంటూ కార్ ఫోటోలను న‌రేష్ షేర్ చేశారు. పర్పుల్ కలర్ లో ఉన్న కారును డ్రైవ్ చేస్తూ న‌రేష్ హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొడుతూ సంబర పడుతున్నారు. ఇక కొత్త కారు కొనడం తో నరేష్ కు ఆయన అభిమానులు సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు.

also read : కౌశ‌ల్ మామూలోడు కాదుగా..సింగిల్ టేక్ లో రెండు పేజీల డైలాగ్…!

Visitors Are Also Reading