మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన కౌశల్ మండ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కొన్ని సినిమాల్లో నటించిన కౌశల్ మండ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. సీరియల్ లో విలన్ పాత్రలు హీరో పాత్రలు చేస్తున్న క్రమంలో బిగ్ బాస్ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కౌశల్ హౌస్ లో జరిగిన కొన్ని సంఘటనలతో ఫుల్ గా సింపతీ ని దక్కించుకుని ఏకంగా కౌశల్ ఆర్మీ ఏర్పాటయ్యే స్థాయికి ఎదిగాడు. తెలుగు బిగ్ బాస్ సీజన్ల లో ఎవరికీ లేనంత మంది అభిమానులను కౌశల్ సంపాదించుకున్నాడు.
ఇక బిగ్ బాస్ విన్నర్ గా గెలిచిన తర్వాత కౌశల్ కాస్త బిజీ అయిన సంగతి తెలిసిందే. ఓవైపు టీవీ షోలు చేస్తూనే మరోవైపు సినిమాలు అవకాశం దక్కించుకున్నాడు. ఇక కౌశల్, సునీల్ ప్రధాన పాత్రలో యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కించారు. అతడు ఆమె ప్రియుడు అనే టైటిల్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై పూనం కృష్ణకుమారి సమర్పణలో రామ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 4న విడుదల చేయబోతున్నారు.
అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ లలో భాగంగా చిత్ర యూనిట్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇంటర్వ్యూలో దర్శకుడు యండమూరి వీరేంద్రనాథ్ కౌశిక్ పై ప్రశంసలు కురిపించాడు. సింగిల్ టేక్ లో కౌశల్ చెప్పిన డైలాగ్ ను చిత్రయూనిట్ విడుదల చేయగా…. రెండు పేజీల డైలాగ్ ను కౌశల్ సింగిల్ టేక్ లో చెప్పారని యండమూరి వీరేంద్రనాథ్ ప్రశంసలు కురిపించారు. అంతే కాకుండా కౌశల్ కు నటుడిగా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రశంసలు కురిపించారు. మరి ఈ సినిమా మా ఏమేరకు విజయం సాధిస్తుందో చూడాలి.