ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పేరెంట్స్ టీచర్స్ సమస్యగా పరిష్కరించాలని అన్నారు. బోర్డు పరీక్షలకి ముందు విద్యార్థులను ప్రోత్సహించాలని చర్చ కార్యక్రమం సందర్భంగా ప్రధాన నరేంద్ర మోడీ వాళ్ల తో మాట్లాడారు పోటీ సవాళ్లు జీవితం లో స్ఫూర్తిగా పని చేస్తాయని చెప్పారు. ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని అన్నారు. ఎవరికివారు ఉత్తమంగా నిలవడానికి దృష్టి పెట్టాలని అన్నారు.
Advertisement
Advertisement
తోటి వాళ్ళతో కాకుండా తమతో తామే పోటీ పడాలని విద్యార్థులకు చెప్పారు తల్లిదండ్రులని పిల్లల్ని ఇతరులతో పోల్చడం మానేయమని వారిలోని మనోధైర్యాన్ని విశ్వాసాన్ని తగ్గించద్దని మోడీ చెప్పారు. దానికి బదులుగా విద్యార్థుల తో సరైన సంభాషణలు జరిపి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. పిల్లల రిపోర్ట్ కార్డు ని విజిటింగ్ కార్డు గా పరిగణించవద్దని పేరెంట్స్ కి సూచించారు మనసు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉండడం ముఖ్యమని చెప్పారు మోడీ. మొదటి రోజు నుండి విద్యార్థులు, పిల్లలు స్నేహపూర్వకంగా ఉంటే పరీక్షల్లో ఎలాంటి ఒత్తిడి వారికి ఉండదు అని అన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!