Home » మా డాడీలా డైలాగ్స్ చెప్పే మగాడు ఇంకా పుట్టలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన బ్రాహ్మిణి..!!

మా డాడీలా డైలాగ్స్ చెప్పే మగాడు ఇంకా పుట్టలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన బ్రాహ్మిణి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాప్ హీరోల్లో ఆయన మొదటి స్థానంలో ఉంటారని చెప్పవచ్చు. అలాంటి నందమూరి నట సింహం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అభిమానులను సంపాదించుకున్నాడు. ఆరు పదుల వయసు దాటిన ఇప్పటికీ కుర్ర హీరోలకు దీటుగా సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు పోతున్నారు.

Advertisement

also read;“వీర సింహ రెడ్డి” కి ఇదొక్కటే మైనస్ అయ్యిందా ?లేకుంటే బ్లాక్ బస్టర్ అయ్యేదా ?

అలాంటి బాలయ్య గత ఏడాదిలో అఖండ మూవీతో ప్రేక్షకులను పరికరించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక తాజాగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కిన వీరసింహారెడ్డి జనవరి 12న థియేటర్లోకి వచ్చింది. మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక చిత్రంలోని డైలాగ్స్,సన్నివేశాలు, పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక మరీ ముఖ్యంగా డైలాగ్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Advertisement

ఇకపోతే తాజాగా బాలయ్య కూతురు నారా బ్రాహ్మణి నాన్న బాలకృష్ణ సినిమా పై ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రాహ్మణి మాట్లాడుతూ చిత్రంలో సన్నివేశాలు, డైలాగులు చాలా బాగున్నాయి అని చెప్పింది. మా నాన్న లాగా డైలాగులు చెప్పేవారు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఇండియాలో కూడా ఎవరు పుట్టలేదని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది నారా బ్రాహ్మణి. ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి.

also read;

Visitors Are Also Reading