ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హహా కనిపిస్తోంది. సినిమాలో కంటెంట్ ఉంటే చాలు పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, బాహుబలి లాంటి సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు నాని కూడా పాన్ ఇండియా స్థాయిలో పరిచయం కాబోతున్నాడు.
Advertisement
నాని దసరా సినిమాలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో మార్చి 30న విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ నానికి జోడీగా నటించింది. అంతే కాకుండా ఈ సినిమా ట్రైలర్ మరియు సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి.
Ad
also read : ఉగాది ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏంటి?
Advertisement
ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాని మందు కొట్టి కొన్ని సీన్ లలో నటించాడు అంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాని ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. పాత్ర డిమాండ్ చేస్తే నటుడు ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవాలని నాని అన్నారు.
దర్శకుడు శ్రీకాంత్ కొన్ని సీన్ లలో మందుకొట్టి నటించాలని నీకేమైనా అభ్యంతరం ఉందా అని అడిగాడని చెప్పాడు. దాంతో నాకు ఎలాంటి అభ్యంతరం లేదని అవసరం ఉన్న సీన్ లలో నిజంగానే మందుకొట్టి నటించానని చెప్పాడు. అంతే కాకుండా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నన్ను కావాల్సినంత వాడుకున్నాడంటూ నాని కామెంట్ చేశాడు. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మార్చి 30 వరకూ వెయిట్ చేయాల్సిందే.
aslo read :హీరోయిన్ సౌందర్యకు కొడుకు కూడా ఉన్నారా.. బయటకు వచ్చిన అసలు నిజం..!!