సాధారణంగా చాలా వరకు ఎక్కువగా మంచి వారిని దేవుడు త్వరగా తన వద్దకు తీసుకెళ్తుంటాడు. మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. ఆవ్యక్తులను కోల్పోయిన తరువాత చాలా బాధపడుతుంటాం. అలాగే నందమూరి తారకరత్నని కూడా చిన్న వయస్సులోనే ప్రాణాలను విడిచాడు. వాస్తవానికి తారకరత్న అంత త్వరగా చనిపోవాల్సిన వ్యక్తి కానే కాదు. కానీ అలా ఎందుకు జరిగింది అని అందరూ మదనపడుతున్నారు.
Advertisement
అతడిని ఎలాంటి వేదన కలిచి వేసిందో, ఏం పీల్చి వేసిందో కానీ ఎప్పుడూ నవ్వుతూనే అందరినీ పలుకరించేవాడు. 40 ఏళ్లు దాటక ముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. తొలి నుంచి తారకరత్న భార్యను నందమూరి కుటుంబం ఆదరించలేదు. ఇప్పుడు ఒక పాప కూడా ఉంది. ఇక వారి బాధ్యత ఎవరు తీసుకుంటారు అనే ప్రశ్న అందరిలో మొదలైంది. ఏది ఏమైనప్పటికీ తారకరత్న విషయంలో మాత్రం అటు కుటుంబం, ఇటు కెరీర్ విషయంలో బయటి ప్రపంచానికి తెలియని విషయాలు కొన్నింటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడిన వంటలక్క..!!
Advertisement
తారకరత్న కెరీర్ విషయానికొస్తే.. ఒక వైపు కళ్యాణ్ రామ్ మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ తన కన్న వయస్సులో చిన్న వారైనప్పటికీ దూసుకుపోతున్నారు. కానీ తన కెరీర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరు కాదన్నా అవును అన్నా తారకరత్నను జూనియర్ ఎన్టీఆర్ కి పోటీగానే హీరోను చేశారు. కుటుంబమంతా శాయశక్తులా ప్రయత్నించి ఒకేరోజు 9 సినిమాలు ప్రారంభించే విధంగా జాగ్రత్త తీసుకున్నారు.
Also Read : ప్రభాస్ తో, తారకరత్న నటించే అవకాశాన్ని మిస్సయ్యారని మీకు తెలుసా..?
ఈ హీరో విషయంలో మాత్రం ఇలా జరుగలేదు. ఇకపై జరగదు. ఒకే రోజు 9 సినిమాలను ప్రారంభించడానికి నందమూరి కుటుంబం తమ పలుకుబడి మొత్తం ఉపయోగించింది. కానీ అందులో రెండు లేదా మూడు సినిమాలు మాత్రమే విడుదల అయ్యాయి. విలన్ గా కూడా సత్తా చాటాలనుకున్న తారకరత్న కొన్ని సినిమాలకే పరిమితమయ్యాడు. అమరావతి చిత్రంలో విలన్ గా నటించినందుకు మాత్రం నంది అవార్డును అందుకున్నాడు. 20 ఏళ్లలో చేసింది 22 సినిమాలు. చాలా ఏళ్లు డిప్రెషన్ లోనే ఉండిపోయాడు. అది ఎవరి పై చూపించలేదు. అలాగే రాజకీయాల్లో అయిన బిజీ అవ్వాలని అనుకున్నాడు. అందుకు అంతా సిద్ధం చేసుకుంటున్న కుప్పం లోకేష్ పాదయాత్ర కోసం వెళ్లి అక్కడే కుప్ప కూలిపోయాడు.
Also Read : 1990లో వచ్చిన ఆ రెండు సినిమాల్లో ఒక చిత్రం ఇండస్ట్రీ హిట్ అనడంతో వివాదం..!