Home » పవన్ కళ్యాణ్, నమ్రత కాంబినేషన్లో మిస్ అయిన మూవీ ఏదో తెలుసా.!

పవన్ కళ్యాణ్, నమ్రత కాంబినేషన్లో మిస్ అయిన మూవీ ఏదో తెలుసా.!

by Mounika
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత బాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అనేది చాలామందికి తెలిసిన విషయమే. వంశీ చిత్రంతో మహేష్ సరసన హీరోయిన్గా నటించి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది నమ్రతా. ఇక మహేష్ బాబుతో సినిమా తరువాత నమ్రత మెగాస్టార్ చిరంజీవి అంజి సినిమాలో మాత్రమే నటించింది. మహేష్ హీరోగా కెరీర్ ని ప్రారంభించే సమయానికే నమ్రత బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. వంశీ చిత్రంతో ఏర్పడిన మహేష్ నమ్రత పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి మరీ మహేష్ బాబును ప్రేమ వివాహం చేసుకుంది.

Advertisement

పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగు పెట్టింది నమ్రత.పెళ్లి తర్వాత సినిమాలు మానేసి ఫ్యామిలీని చూసుకోవాలని నమ్రుతాకి మహేష్ కండిషన్ పెట్టినట్లు అప్పట్లో వార్తలు బాగా ప్రచారం అయ్యాయి. ప్రస్తుతం నమ్రత అటు ఫ్యామిలీని ఇటు మహేష్ బాబు బిజినెస్ వ్యవహారాలను మొత్తం ఆమె చూసుకుంటూ కుటుంబాన్ని సక్రమంగా నడుపుతుంది. ఈ క్రమంలోనే నమ్రతకి సంబంధించి ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

anji movie

Advertisement

ఇంతకీ ఆ విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ కెరియర్ లో బాలు సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా అభిమానుల మనసులో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఎందుకంటే అప్పటిలో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్ గా సాగిన ఈ సినిమాకి బాలు ఏ బి సి డి ఇ ఎఫ్ జి ( ఎ బాయ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ ఎ గర్ల్) అనే క్యాప్షన్ అప్పటిలో యూత్లో మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జంటగా శ్రియ, నేహా ఒబెరాయ్ హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హీరోయిన్ నేహా పాత్ర గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం ముందుగా నేహా పాత్రలో నమ్రతను సంప్రదించడం జరిగిందట మూవీ మేకర్స్.

 

 

ఈ సినిమా కథ నమ్రతకు కూడా బాగా నచ్చిందట. కానీ మహేష్ బాబు మాత్రం సినిమాలో నటించడానికి అనుమతి ఇవ్వలేదట. ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నాం.. మళ్ళీ కొత్త సినిమాలు కమిట్ అవ్వడం ఎందుకు.. ముందు చిరంజీవి గారి మిగిలిన సినిమా షూటింగ్ పూర్తిచేయి చాలు అంటూ మహేష్ చెప్పారట. అలా ఇష్టం లేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమాని నమ్రత వదులుకోవాల్సి వచ్చిందట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఒకవేళ నమ్రత ఈ సినిమా చేసి ఉంటే ఆమె కెరియర్ లోనే గుర్తుండిపోయే మంచి సినిమాగా ఉండేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

ఉపాసనపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన రామ్ చరణ్..! ఇంతకీ ఏం జరిగిందంటే..!

కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షికి ఇష్టమైన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..?

అప్పటిలో సావిత్రిని ఏఎన్ఆర్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారా..?

Visitors Are Also Reading